అమ్మాయీ ఓ అమ్మాయీ 11

By | November 2, 2022
telugu stories sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 11 చెల్లమ్మా! నీ సర్క్యులేషన్ డిపార్ట్ మెంట్ సంగతేమిటి? ఏమేం మార్పులు చేయ్దల్చుకున్నావ్ నువ్వు?" "మన తెలుగు కిరణం ఏయే ఏరియాల్లో ఎక్కువ అమ్ముడవుతుందో , ఏయే ఏరియాల్లో అమ్ముడవటం లేదో - వివరాలు తయారుచేస్తున్నాను - అప్పుడు గానీ ఇంప్రూమెంట్ గురించి ఆలోచించటం కుదరదు -" "ఓకే ప్రొసీడ్! ఈలోపల నేను ఓ గంట సేపు వెస్ట్ పేపర్ రూమ్ లో నిద్రపోతాను. కళ్ళు మనం చెప్పిన మాట వినటం లేదు. ముగ్గురూ లేచి నిలబడ్డారు. వెంకటేశ్వర్లు నెమ్మదిగా గదిలో కొచ్చి "సార్!' అన్నాడు వినయంగా. ముగ్గురూ ప్రశ్నార్ధకంగా అతని వేపు చూశారు. వెంకటేశ్వర్లు ముక్కు పొడుం దట్టించాడు. "పోస్టల్ వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది సార్! మనం డబ్బు కట్టకపోవటం చేత మన కరస్పాండెంట్స్ న్యూస్ పంపే సౌకర్యం నిలిపివేస్తున్నారు" చెప్పాడతను. భవానీశంకర్ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు మళ్ళీ. వెంకటేశ్వర్లు చిదానందంగా గదినుంచి బయటికి వెళ్ళిపోయాడు. "ఏం జరిగింది?" అర్ధం గాక అడిగింది స్వప్న. "కొన్ని టౌన్స్ లో మన 'తెలుగు కిరణం' పేపర్ కి కరస్పాండెంట్లు వున్నారు. వాళ్ళు తాము సేకరించిన వార్తల్ని కన్సెషన్ రేట్లతో తెలిగ్రామ్స్ ద్వారా పంపిస్తారు. మనం ఆ బిల్లులను కట్టలేక పోయినందుగ్గాను ఆ సౌకర్యం రద్దు చేశారన్న మాట! అంటే మన వాళ్ళు మనకి న్యూస్ మాములు పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. అంటే ఆ న్యూస్ మనకి చేరేసరికి నాలుగయిదు రోజులు కూడా పట్టవచ్చు - " చెప్పాడు చిరంజీవి. స్వప్న కూడా నిరుత్సాహంగా కుర్చీలో కూలబడింది మళ్ళీ. ***** శివతాండవం పోలీస్ స్తేషన్లోంచి బయటికొచ్చాడు. "ఒరేయ్ భవానీశంకర్! ఎంతోమందిని ఆటలు పట్టించిన నన్నే నువ్వు ఆటలు పట్టిస్తున్నావ్ కదరా! చూడు ! ఈ దెబ్బతో మీ అట కట్టించేస్తాను!" బట్టతల కసిగా రుద్దుకుంటూ వడివడిగా అటో స్టాండ్ దగ్గరకు నడిచాడతను. ***** దీప్ చంద్ అమ్మాయీ వెన్నెల్లో టెర్రేస్ మీద కూర్చుని ఉన్నారు. దీప్ చంద్ మొఖం ఎప్పటిలాగే మేఘాలు కమ్మి వుంది. "ఇలా ఇంకెన్నాళ్ళు గడపాలో అర్ధం కావటం లేదు ...." దిగులుగా అన్నాడు దీప్ చంద్. "ఇంకెన్నాళ్ళు అవసరం లేదు దీప్ చంద్! మా డాడీకి ఇప్పుడిప్పుడే నీమీద గొప్ప గౌరవం ఏర్పడిపోతోంది. మధ్యాహ్నం నువ్వు సోఫాలో 'టీ' వలకబోసినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఇంత ఇడియట్

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.