అమ్మాయీ ఓ అమ్మాయీ 2

By | August 8, 2022
telugu kathalu navalalu sahithi  అమ్మాయీ ఓ అమ్మాయీ 2 భవానీశంకర్ భయంగా రూఫ్ వంక చూశాడు. సరిగ్గా అప్పుడే ఓ సిమెంటు పెళ్ళ ఊడి పెద్ద శబ్దంతో టేబుల్ మీద పడింది. అందరూ చెల్లాచెదురై బయటకు పరుగెత్తారు. ***** ఎండ కాల్చేస్తోంది. మొఖం మీద నుంచి వర్షపు బిందువుల్లా జారిపడుతున్న చెమటను తుడుచుకుంటూ నడుస్తున్నాడు చిరంజీవి. ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టాడు నడక. ఇప్పుడు టైము ఒంటిగంట! జీవితంలో ఇదే మొదటిసారి ఇంతదూరం నడవటం! అతని కాళ్ళు తెలిపోతున్నాట్లున్నాయ్. గొంతు దాహంతో ఎండిపోతోంది. ఎండ వేడికి ఉండుండి కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్! కళ్ళ వెంబడి నీళ్ళు తిరగడం ఎండ వేడి కెనా? చిరంజీవి అతికష్టం మీద దుఖమపుకున్నాడు. ఎందుకు తనను తనే భ్రమ పెట్టుకోవటం? తనున్న దారుణమయిన పరిస్థితికే కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్! టైము ఒంటిగంటన్నర. టక్కున అతనికి స్వప్న గుర్తుకొచ్చింది. తలుపు దగ్గరే నిలబడి తన కోసం ఎదురు చూస్తుంటుంది - ఆకలితో - తను యింటికి రాలేదన్న కోపంతో - దహించుకుపోతూ - అవునూ! స్వప్న కేందుకంత కోపం ఎక్కువయిపోయింది మధ్య? లేమికి కోపం సహజ గుణమా? బంగారు నగల దుకాణంలోకి నడిచాడు చిరంజీవి. లోపలి చల్లదనానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. "కొంచెం మంచినీళ్ళిస్తారా?" ఓ స్టూల్ మీద కూర్చుంటూ అడిగాడు. కుర్రాడు మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. గడగడ తాగి గ్లాస్ కౌంటర్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.