అమ్మాయీ ఓ అమ్మాయీ 5
telugu kathalu navalalu sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 5 ముఖ్యంగా తన దేవత స్వప్న కోసం.
తనకోసం తల్లిదండ్రుల్ని, డబ్బు యిచ్చే అనేక సుఖాలనూ వదిలేసి వచ్చిందామె. అందుకు ఆమె పశ్చాత్తాప పడే పరిస్టితి రాకూడదని తన కోరిక! ముఖ్యంగా బీదతనం వల్ల అసలే రాకూడదు.
కానీ స్వప్న కసలు ఇష్టం లేదా ప్రయత్నాలు.
ఇలాంటి షరతులు ఆంక్షలు, ఉన్న ఆస్తి అనవసరమని ఆమె అభిప్రాయం. అంతకుముందు రోజు ఉదయం నుంచి ఇద్దరికీ ఆ విషయంలో వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయ్.
"గుడ్ మాణింగ్ సర్!' సెల్యూట్ కొట్టాడు వాచ్ మన్.
"గుడ్ మాణింగ్ ....' లోపలకు నడిచాడు చిరంజీవి.
చీఫ్ ఎడిటర్ శివతాండవం అతనిని చూసి చూడనట్లు నటించాడు.
కొద్ది క్షణాలు అతని కేదురుగ్గా ఉన్న కుర్చీలోనే కూర్చున్నాడు చిరంజీవి.
"అరే! చిరంజీవా? ఎప్పుడొచ్చావ్?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు , కాసేపటి తర్వాత చేతిలోని పేపరు చదవటం ఆపి.
"అయిదు నిమిషాలయింది."
"ఓ! అలాగా! ఏమిటి విశేషం.
"ఇవాళ్టి నుంచి ఆఫీసు కొచ్చి 'తెలుగు కిరణం' వ్యవహారం చూడాలని నిర్ణయించుకున్నాను."
శివతాండవం మరింత ఆశ్చర్యంగా చూశాడు.
"నువ్వు ఆఫీస్ కొస్తావా?"