అమ్మాయీ ఓ అమ్మాయీ 6

By | September 12, 2022
telugu stories kathalu novels అమ్మాయీ ఓ అమ్మాయీ 6 తన చెవులు రెండూ ఎడ్జస్ట్ చేసుకుని "ఈ మధ్య నా చెవులు భలే తమాషాలు చేసున్నాయిలే! ఇప్పటికిప్పుడే చూడరాదూ? నువ్వు 'అరవై పైసలు అప్పివ్వు?" అని అడిగినట్లు అనిపించింది ...." అన్నాడు విస్మయంతో. "నిజంగానే అడిగాను!" అన్నాడు చిరంజీవి తొణక్కుండా. "ఏమిటి? అరవై పైసలా?" "అవును!" "ఎందుకు?" "ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరం తిరిగి కలుసుకున్న ఈ ఆనందకరమయిన సమయంలో వన్- బై- టూ- 'టీ' తాగుదామని. అంతే! నా దగ్గరున్న నలబై అయిదు పైసలతో ఇంతకుముందే ఎన్టీఆర్ 'టీ' తాగేశాను. ఇప్పుడు టైం పది దాటింది కదా మరి! అరవైపైసలు కావాలి!" "డోంట్ వర్రీ మైడియర్ ఫ్రెండ్! ఏ కంపెనీ నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేసినా ఓ నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తుంది కాబట్టి - మన దగ్గర ఎప్పుడూ బాలెన్స్ ఉంటూనే ఉంటుంది. అదలా ఉందనీ గానీ - నువ్వు లక్షాధికారివయుండి , అరవై పైసలు అప్పు అడగటం ....." ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్. చిరంజీవి మళ్ళీ గాడంగా నిట్టూర్చాడు. 'అదో పెద్ద కధ గురూ! ముందు టీ ఆర్డర్ చెయ్!" అంటూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. భవానీశంకర్ కూడా కూర్చుంటూ సర్వర్ సురేష్ వేపు తిరిగి సన్నగా విజిల్ వేశాడు. "వొండరపుల్ మొగలాయీ పౌనా మైడియర్ సురేష్! వన్- బై- టూ తీసుకురా!" "పవనా ఏక్!" అని అరుస్తూ - అరుపు వెనుకే లోపల కెళ్ళి రెండు కప్పుల్లో చేరి సగం 'టీ' తెచ్చి వారి ముందుంచాడు. ఇదరూ 'టీ' కప్పులు గాలిలో తాటించి 'చీర్స్' అనుకున్నారు . కొంచెం 'టీ'

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.