అమ్మాయీ ఓ అమ్మాయీ 8

By | September 22, 2022
telugu stories kathalu sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 8 ఇద్దరూ బయటకు నడుస్తుంటే భవానీశంకర్ లేచి వారి వెనుకే బయటికొచ్చాడు. "అన్నట్లు - హనుమాన్ - ఓ విషయం చెప్పటం మర్చిపోయాను! ఇవాళ నేను ఇక్కడ చేరిన రోజు కాబట్టి చాలా బిజీగా ఉంటాను - కనుక - ఎవ్వరినీ లోపలకు రానీయవద్దు. ఒకవేళ మరీ అత్యవసరమయితే - పర్సనల్ గా నా అనుమతి తీసుకున్నాకే - లోపలకు పంపించు-" "యస్సార్" మళ్ళీ మిలటరీ సెల్యూట్ కొట్టాడు హనుమాన్. "నువ్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నావ్ హనుమాన్! ఇదంతా నా మనసులో ఉంటుంది - ఏం - ఫరవాలేదు-" హనుమాన్ శ్రీరాముల్ని గట్టిగా తోస్తూ బయటకు నడిచాడు. సెక్యురిటీ రూమ్ లోకెళ్ళేసరికి శ్రీరాములుకి చెమటలు పట్టేసినాయ్! తన ఉద్యోగం నిజంగా పొతే తన కుటుంబం గతేమిటి? అన్న ఆలోచన సతమతం చేసేస్తోంది. శివతాండవం ఇంకా రాలేదేమిటి ఇవాళ? ఆయనోస్తే తనకు కొంత ధైర్యంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే శివతాండవం కారు హారన్ వినిపించింది. హనుమాన్ స్ప్రింగ్ లా ఎగిరి గేటు కడ్డంగా నిలబడ్డాడు. శివతాండవం ఉలిక్కిపడి సడెన్ బ్రేక్ వేశాడు. "ఏమిట్రా! ఏం రోగమొచ్చింది? ఎందుకలా ఎగిరి అడ్డం వచ్చావ్?" కిటికీలోంచి తల బయటకు పెట్టి కోపంగా అడిగాడు శివతాండవం. "లోపలికేవర్నీ రానీయోద్దన్నారండీ చీఫ్ ఎడిటర్ గారు." శివతాండవం కార్లోనే అదిరిపడటం చేత కారంతా ఎవరో కుదిపినట్లు ఊగింది. "ఏరా? పొద్దున్నే తాగొచ్చావా!" అన్నాడు ఆవేశంగా. దాంతో హనుమాన్ కి వళ్లు మండిపోయింది. వళ్ళు మండితే అతను మిలటరీ ఇంగ్లీష్ ఉపయోగిస్తాడు. "డోంట్ నాన్సెన్స్ స్పీక్ సర్! అయ్ నాట్ లైక్ నాన్సెన్స్! ఎవరైనా సరే, తన అనుమతి లేనిదే లోపలికి రానివ్వగూడదని కొత్త చీఫ్ ఎడిటర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు-" శివతాండవానికి మతిపోయినట్లయింది. తనకు జరుగుతున్న

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.