అర్దరాత్రి ఆడపడుచులు 10

By | October 30, 2022
telugu stories sahithi అర్దరాత్రి ఆడపడుచులు 10 అక్కడిదోమలు! విపరీతంగా! దోమలు ఇంకా ఉండి ఉంటాయా? దోమలు ఉంటే ఉంటాయి కానీ అమ్మా! నాన్నా? తమ్ముడూ చెల్లీ? ఇంకా, అక్కడే ఉన్నారా? ఉంటారా? ఆమె మనసు దిగులుగా అయిపోయింది. ఉంటే, ఏం చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు? తమ్ముడూ చెల్లీ ఏం చదువుతున్నారు? ఏమనుకుంటున్నారు తనని గురించి? చనిపోయిందనుకుంటున్నారా? చెడిపోయిందనుకుంటున్నారా? అందరూ గుర్తున్నారు తనకి. కానీ వాళ్ళ రూపు రేఖలు మాత్రం అంతగా గుర్తులేవు. అస్పష్టంగా కనబడతారు వాళ్ళు తనమనోఫలకం మీద. పెన్సిల్ తో గీసిన బొమ్మలని అక్కడక్కడ రబ్బరుతో తుడిచేసినట్లు..... అమ్మది పొడుగాటి జడ. అది క్లియర్ గా గుర్తుంది తనకి. తడిగా మెరుస్తూ ఆర్ద్రంగా కనబడే కళ్ళు అమ్మవి. అవి తనకు కళ్ళకుకట్టినట్లు కనబడుతూనే ఉంటాయి ఇంకా. అలాగే నాన్నగారూ.... ఆయనకి గెడ్డం కింద పెన్సిల్ తో నొక్కినట్లు గుంట ఉంటుంది. తను నాన్నగారితో మాట్లాడుతుంటే తల ఎత్తి చూడవలసివచ్చేది. అలాచూసినప్పుడల్లా ఆ గుంట చాలా ప్రామినెంట్ గా కనబడేది. చెల్లెలికి చెవికిందగా చెంపమీదతేనెచుక్క పడినట్లు పుట్టుమచ్చ..... తమ్ముడికి నుదిటిమీదపడే జుట్టు..... ఇనేవాళ్ళ రూపాలను గురించిన తనకిమిగిలిన జ్ఞాపకాలు! పద్దెనిమిదేళ్ళక్రితం తను అవన్నీ మర్చిపోవాలని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.