అర్దరాత్రి ఆడపడుచులు 15
telugu stories sahithi అర్దరాత్రి ఆడపడుచులు 15 "అయ్యలారా! కడుపుకోసం దొంగతనాలు చేస్తాం మేం. మా కడుపులు కొట్టితినే గజదొంగలు పోలీసులు. మేము దోపిడీ చేసినప్పుడల్లా బస్సుకి మూడువేలరూపాయల చొప్పున పోలీసులకి మామూలు ఇవ్వాలి.
ఇవాళ మీ అందరి దగ్గరా ఉన్న డబ్బంతా కలిపి నా రెండువేలు లేదు. ఈ దోపిడీ గనక చేశామంటే మాకు దమ్మిడీ రాకపోగా పైగా మేమే పోలీసులుకు వెయ్యి రూపాయలు ఎదురుకట్టాల్సివస్తుంది. మా దారినమమ్మల్ని ఇట్లాపోనియ్యండి నాయనల్లారా" అని బస్సు దిగి వెళ్ళిపోయారు.
నవ్వింది అలేఖ్య.
అతనుకూడా "గుడ్ నైట్" అన్నాడు.
"గుడ్ నైట్!"
అతను వెళ్ళిపోయాక ఒక యాపిల్ పండు తిని మంచినీళ్ళు తాగి తలుపులు వేసి లైట్లు ఆర్పేసి డిమ్ గా ఉన్న లేతనీలంరంగు నైట్ లాంప్ వేసిపడుకుంది అలేఖ్య. రైలు కుదుపు ఉయ్యాలలా ఊపుతుంటే ఆమెకి త్వరగానే నిద్ర పట్టేసింది.
పొద్దున తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. మెలకువ రావడంతోనే కాఫీ గుర్తు వచ్చింది అలేఖ్యకు. నిద్రలేవగానే కాఫీ తాగకుండా ఉండలేదు తను. నెక్స్ ట్ స్టేషన్ లో కాఫీ దొరకవచ్చా?
ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయింది. తలుపు తెరిచింది అలేఖ్య. రైల్వే కేటరింగ్ సర్వీస్ బాయ్ నిలబడి వున్నాడు. అతని చేతిలో ఒక ట్రే. అందులో అందమైన పింగాణీ కప్పులు ఉన్నాయి. ఒక చిన్న జగ్గులో డికాక్షన్, మరొక జగ్గులో పాలూ, ఒక చిన్న బవుల్ లో షుగర్ క్యూబ్ లు ఉన్నాయి. ఒక ప్లేటులో శాండ్ విచెస్ ఉన్నాయి. వాటన్నిటిమీదా అతి పల్చటి లేసుగుడ్డ కప్పి వుంది.
ప్రశ్నార్ధకంగా చూసింది అలేఖ్య.
"కాఫీ అమ్మా! సాబ్ ఇవ్వమన్నారు"
"ఎవరు?"
"ఆసాబ్!" పక్క కంపార్టుమెంట్ వైపు చూపించాడు ఆ బాయ్.
రాత్రి తనతో మాట్లాడిన అతనే అవి పంపిఉంటాడని అర్ధం చేసుకుంది అలేఖ్య.
రైల్వేవాళ్ళూ ఇంత మర్యాదగా సర్వీసు చేస్తున్నారంటే అతనికి చాలా పరపతి ఉండి ఉండాలి.
"థ్యాంక్స్! అక్కడ పెట్టు" అని చెప్పి బ్రష్షుమీద పేస్టు వేసుకుని బాత్ రూం వైపు నడిచింది.
అప్పటికీ అతను షేవ్ చేసుకుని బట్టలు మార్చుకుని ఫ్రెష్ గా కనబడుతున్నాడు. అప్పుడు మొదటిసారిగా గమనించింది అలేఖ్య. అతను చాలా పొడుగు బలిష్టంగా ఉన్నాయి భుజాలు. చిన్నప్పటినుంచి