అర్దరాత్రి ఆడపడుచులు 2

By | August 8, 2022
telugu kathalu navalalu అర్దరాత్రి ఆడపడుచులు 2 అక్కడే పంజరంలో ఉన్న మైనాపిట్ట, తాను కోల్పోయిన స్వేచ్చని తలుచుకుని దుఃఖిస్తున్నట్లు విషాదంగా అరవడం మొదలెట్టింది. వ్వవ్వవ్వ పంజరం కంటే పెద్దదేమీకాదు ఆ గది. చీకటిగా ఉంది. చాల రోజులనుంచి తలుపులు మూసి ఉంచినట్లు అదొక రకమైన వాసనవస్తోంది. కప్పుకి బదులుగా ఉన్న రేకు మీద వాన చినుకులు పడుతూ ఉంటే టప్పు టప్పు మనే ఆ శబ్దం లౌడ్ స్పీకర్ వినిపించినట్లు పెద్దగా వినబడుతోంది. వాన నీరు మట్టి గోడలలోకి ఇంకి, గదినంతా చెమ్మగా చేస్తోంది. చెప్పలేనంత దిగులుగా ఉంది అక్కడివాతావరణం. ఒకపాత ఇనప మంచంమీద పడుకుని ఉంది సృజన కాదు, పడుకున్న భంగిమలో మంచానికి కట్టివేయబడి ఉంది ఆమె. కేకలువేసి వేసి ఆమె గొంతుతడారిపోయినా, ఒక్క కేకా బయట ఉన్నవాళ్ళెవరికీ వినబడలేదు. ఆమె నోట్లో ఒక మురికి బనీను కుక్కి ఉంది. ఉండిఉండి వెక్కుతోంది సృజన. కన్నీళ్ళతో ఆమెబుగ్గల మీద చారికలుకట్టి ఉన్నాయి. ఎక్కడ ఉంది తను? తనని ఎత్తుకు వచ్చింది ఎవరు? ఎందుకు ఎత్తుకొచ్చాడు? మళ్ళీ ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది సృజనకి. చాలాసేపటి తర్వాత దుఃఖాన్ని ఉగ్గబట్టుకుని, జరిగినదంతా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది సృజన. స్కూలువదలగానే బయటికివచ్చింది తను. జైహింద్ స్టోర్స్ పక్కనున్న సందులో నుంచి తిరిగిరావడం తనకి అలవాటు. ఆ సందు కొంచెం లోన్లీగా ఉంటుంది. అయినా అలవాటైనసందు కాబట్టి తను ఎప్పుడూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.