అర్దరాత్రి ఆడపడుచులు 8

By | September 22, 2022
telugu stories kathalu sahithi అర్దరాత్రి ఆడపడుచులు 8 "నాకొక సాయం చెయ్యగలరామాస్టారూ?" ఆయన ప్రశ్నార్ధకంగా చూశాడు. "నేను ఇక్కడ చిక్కుకుని పోయానని మీరు వెళ్ళి మా నాన్నగారితో చెప్పగలరా మాస్టారూ?" ఆయన ఉలిక్కిపడి సృజనవైపు తేరిపార చూశాడు. వెంటనే భయంగా అంది సృజన. "మీకు ఇష్టం లేకపోతే చెప్పుద్దులేండి. కానీ అహల్యతో మాత్రం నేను ఇట్లా అడిగానని చెప్పకండేం! ప్లీజ్!" ఆయన మాట్లాడకుండా సృజనవైపే చూస్తున్నాడు. నోరుజారి ఎందుకిలా అనేశానా అని గడగడలాడిపోవడం మొదలెట్టింది సృజన. ఏమవుతుందిఇప్పుడు? తనకు ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూస్తుంటే జంకుకలిగింది సృజనకు. ఎదుటిమనిషి ఎలాంటివాడో పూర్తిగా తెలియకముందే తొందరపడి నోరుజారేసిందాతను? ఈయన అహల్యతోచెప్పేస్తాడా తనుమాట్లాడిన మాటలన్నీ? భయంతో గుండె నీరయిపోయింది సృజనకి. అప్పుడు వినబడింది ఆ పిలుపు! అది పిలుపా? ఏడుపా? నూరు అడుగుల లోతు నూతిలినుంచి వస్తున్నంత బలహీనంగా ఉంది ఆ గొంతు. ఎక్కడో విన్న గొంతే! ఎవరిదది? కొద్దిక్షణాల తర్వాత స్ఫురించింది సృజనకు, ఆ గొంతు ఎవరిదయిఉంటుందో! ఒక్క ఉదుటునలేచి నిలచుంది తను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకి అలవాటులేనట్లు మెదలకుండా ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం. గబగబ ముందుకి నడిచింది సృజన. ఆదుర్దాగా ఒక్కొక్క గదిలోకి తొంగి చూస్తూ ముందుకు సాగిపోయింది. కొంతసేపు గడిచాక అర్ధం అయింది సృజనకి. ఆ గొంతు ఒక మారు మూలగదిలోనుంచి

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.