అర్దరాత్రి ఆడపడుచులు 9

By | October 22, 2022
telugu stories kathalu sahithi అర్దరాత్రి ఆడపడుచులు 9 తనకళ్ళముందు జరుగుతున్నదంతా నిస్సహాయంగా నిశ్చేష్టురాలైచూస్తూ నిలబడిపోయింది సృజన. ముక్కలు ముక్కలయి పోతోంది ఆమె మనసు. తనవల్లే.....తనవల్లే జరిగింది ఇదంతా! మేలు చెయ్యబోయి కీడుచేసింది కామక్షికి తను! కామాక్షి ఆకలి తీర్చడానికి ఎవరూగమనించకుండా చాక్లెట్లు ఇవ్వగలుగుతున్నానుకొంది. కానీ ఆ ఇంట్లో తలూపులకి కళ్ళుంటాయి. గోడలకి చెవులుంటాయి చూడకుండానే చూస్తూ ఉంటారు ఇక్కడి మనుషులు. తను కామక్షికి చాక్లెట్లు ఇవ్వడం వీళ్ళకి తెలిసిపోయింది. అయినా బయటపడకుండా ఏం ఎరుగనట్లు వాటిలో డ్రగ్స్ కలపడం మొదలెట్టారు. డ్రగ్స్ కి అలవాటుపడింది కామాక్షి. ఆమెకి ఇప్పుడు అన్నిటికంటే తీవ్రమైన బ్రౌన్ షుగర్ అలవాటు చేస్తున్నారు. బ్రౌన్ షుగర్ గురించిన ఆర్టికల్ ఒకటి చదివింది తను. తనకు తెలుసు అది ఎంత భయంకరమైన వ్యసనమో! మ్ముమీద దమ్ము పీలుస్తోంది కామాక్షి. తర్వాత నెమ్మదిగా గోడకి చేరగిలబడిపోయి కళ్ళు మూసేసుకుంది. దుఃఖంతో పెదిమలు వణుకుతున్నాయి సృజనకి. తనని తాను శపించుకుంది. ఒకసారి కాదు. వందసార్లు.....వేలసార్లు. తనుచాక్లెట్లు చేరవెయ్యకపోతే ఇలాంటి స్థితిలోకి వచ్చేది కాదు కామాక్షి. తప్పంతా తనదే! అవును! నిజం! ఇంతలో రంగేలీ వయ్యారంగా కులుకుతూ వచ్చింది అక్కడికి. "సృజన! అహల్యక్క పిలుస్తోంది! దా!" అంది మొగా ఆడాకాని గొంతుతో. నీళ్ళునిండిన కళ్ళతో ఒకసారి కామాక్షివైపు చూసింది సృజన. జోగుతోంది కామాక్షి. ఇంక చూడలేక చటుక్కున తల తిప్పుకుని గబగబలోపలికి వెళ్ళిపోయింది సృజన. గదిలో మంచంమీద అడ్డంగా పడిపోయి రోదించడం మొదలెట్టింది. ఆ సాయంత్రం మరో క్వార్టరు బ్రౌన్ షుగర్ ఇచ్చాడు ఉస్మాన్ కామాక్షికి రాత్రికి మరో క్వార్టరు ఇచ్చాడు. మొత్తం మూడుసార్లు! అంతే! ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళు ఇవ్వనవసరంలేకపోయింది. కామక్షే కాళ్ళావేళ్ళా పడికావాలని అడగడం మొదలెట్టింది. బ్రౌన్ షుగర్! బ్రౌన్ షుగర్! బ్రౌన్ షుగర్! బ్రౌన్ షుగర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం పట్టడలేదు కామక్షికి. అదే ఆమెకు తల్లి! అదే తండ్రి! అదే దైవం! నెక్స్ టోఫిక్స్' ఎప్పుడు? మూడురోజులయ్యాక కామాక్షికి బ్రౌన్ షుగర్ ఇవ్వడంబంద్ చేశాడు ఉస్మాన్. గుండెలు అలసిపోయేలాశోకాలు పెడుతూ ఏడ్చింది కామాక్షి. నేలమీదపడి పొర్లింది. బతిమాలింది. శాపనార్ధాలు పెట్టింది. కాళ్ళు పట్టుకుంది. కాళ్ళతో తన్నింది. ఎర్రబడి పోయింది ఆమె మొహం. ఎంతతుడుచుకున్నా ముక్కుతడితడిగా అయిపోతోంది. కళ్ళలో నీళ్ళు నిండుతున్నాయి. జ్వరతీవ్రతతోవళ్ళు వెచ్చబడుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రగ్స్ తీసుకోవడానికి

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.