అర్ధరాత్రి ఆర్తనాదం 11

By | November 2, 2022
telugu stories sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 11 "ఆ రహస్యమేదో గట్టిగా తెలుసుకోవాలనే వుంది దామోదరానికి. చెప్పమని మరీ పట్టుబడితే తామిద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొడుతుందేమో అని ప్రస్తుతానికి సరేనన్నాడు దామోదరం. కిరణ్ రహస్యమేదో కామినీ చేతిలో వుంది. ఆ రహస్యమేదో తనకి తెలియకపోయినా కామిని తన చేతిలో వుంది. సమయం వచ్చినపుడు ఆయుధంగా కామినీ నే వాడుకోవచ్చు, అనుకున్నాడు దామోదరం "నాకు ఎట్లాగో అట్లా పదివేలు కావాలమ్మాయ్జ్! ఎట్లా ఇస్తావో నీ యిష్టం." "ఒక్కసారిగా పదివేలు అంటే కష్టం బాబాయ్!" అంది కామిని. "ఆ మాట అనకపోతే నాకివ్వటం ఇష్టంలేదని చెప్పరాదు." నిష్టూరంగా అన్నాడు దామోదరం. "నేను అలా అనుకునేదాన్ని అయితే సొమ్ము తీసుకువచ్చి నీ దగ్గర దాయమని చెబుతానా బాబాయ్! అన్నట్టు ఆ నగలు భద్రంగా ఎక్కడ దాచావ్!" ఇదే సందు అని అడిగివేసింది. కామిని. దామోదరం కాస్త తత్తరపడ్డాడు. ఎందుకంటే వాటిని ఎప్పుడో తగలేయటం జరిగింది. అప్పనంగా చేతిలో డబ్బు ఆడుతుండేసరికి , ఖరీదైన విలాసాలకి డబ్బు తగలేయటం ఎక్కువ అయింది. "ఇంకెక్కడి నగలు. అవి ఎప్పుడో గంగలో కలిశాయి" అని కామినీతో చెబితే డబ్బు ఇవ్వటం మానేసినా మానేస్తుంది. ఇన్నాళ్ళూ తనంతట తానుగా డబ్బిచ్చే మనిషి ఈ రోజు డబ్బడిగితే కుంటిసాకులు చెబుతోంది. తను చాలా తెలివిగా మెలగాలి అనుకున్న దామోదరం "నా మీద అనుమానమా!" అడిగాడు. "ఛ, ఛ అలాంటిదేమీ లేదు బాబాయ్!" అంది కామిని. కాని ఆమెకి అర్ధమయిపోయింది. ఆ నగలు అన్నీ గోవిందార్పణం అయినట్టు. వ్యవహారం బెడిసికొట్టకూడదని తనూ జాగ్రత్తగానే వ్యవహరించింది. "పదివేలు కాకపోతే అయిదువేలన్నా......" నాన్చుతూ ఆగాడు దామోదరం. "తప్పకుండా ప్రయత్నిస్తాను. నాలుగు రోజులు టైమ్ ఇవ్వు" అంది కామిని. కొద్దిసేపు మాట్లాడి ఇద్దరూ విడిపోయారు. కామినీ బంగారు బాతు. ఆ బంగారు బాతు రోజూ పెట్టే గుడ్లతో సహా, తనింట్లో కట్టి పడేయాలనుకున్నాడు దామోదరం. కిరణ్ తో తను చాలా జాగ్రత్తగా మెలగాలి అనుకుంటూనే ఇపుడు తను తన బాబాయ్ తో కూడా జాగ్రత్తగా మెలగాల్సిన పని ఏర్పడింది. రెండు కత్తులమీద తను రెండు కాళ్ళుపెట్టి గాల్లోకి ఎగురుతూ నాట్యం చేయాలి. కత్తులు ఏ కాలినీ గాయపరచ కూడదు. తను బాలన్స్ చేసుకుంటూ నాట్యం చేస్తూ వుండాలి. తను తెలివి తేటలతో ఎంత వరకూ లాక్కురాగలుగుతుందో

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.