అర్ధరాత్రి ఆర్తనాదం 12

By | November 11, 2022
telugu stories kathalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 12 "చాలా పొరబడుతున్నావ్ కిరణ్! పొరపాటున కూడా కామినీకి ఈ ;లెటర్ సంగతి చెప్పకు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కామినీవెళ్ళి వాళ్ళ బాబాయిని అడుగుతుంది. దాని వలన కొంచెం కూడా ప్రయోజనం వుండదు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైనా కావచ్చు. ఇపుడు మనం చెయ్యాల్సింది అది కాదు, వాళ్ళ వేలితో వాళ్ళ కన్నునే పొడవడం. ఎటు నుంచి ఎటు నరుక్కువస్తే వాళ్ళు శాశ్వతముగా నరకబడతారో నేను చూస్తూంటాను. నువ్వు చూస్తూ వూరుకో. ఈ క్షణంనుంచి రంగంలోకి నేనుదూకుతున్నాను. డోంట్ వర్రీ" రావుగారు అప్పటికప్పుడే ఓ పధకం పన్నుతూ అన్నారు. "వాళ్ళదగ్గిర సాక్ష్యాధారాలు వున్నాయి డాడీ!" "నీ తండ్రిని అంత తక్కువగా అంచనావేయకు కిరణ్ సాక్ష్యాదారాలు ఉపాయంగా నాచేజిక్కించుకొని వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొడుచుకు చచ్చేలా చేస్తాను. నువ్వు చూస్తూ వుండు. అంతేకాదు నువ్వు కామినీదగ్గిర మామూలుగానే భయపడుతున్నట్లు నటించు. ఏదో ఒకరోజు నీనోటితో నువ్వె "డాడీ! నువ్వు యుక్తులు వేయడంలో చాణక్యుడిని మించిన వాడవి. నీ పథకంలో నన్ను పైకి తీసుకొచ్చావ్" అని అంటావు. రావుగారు గర్వంగా అన్నారు. ఆ తరువాత. రావుగారు కిరణ్ తో తన పధకం చెప్పలేదు కాని, కొన్ని ప్రశ్నలు వేసి అనుమానాలు తీర్చుకున్నారు. తనకి కావలసిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. "ఈ క్షణం నుంచే నిన్ను రక్షించే ప్రయత్నంలొ వున్నాను అంటూ రావుగారు కూర్చున్న చోటునుండి లేచారు. కిరణ్ పట్టలేని ఆనందంతో "థాంక్స్ డాడీ!" అన్నాడు. 26 "ఇక్కడ కూర్చుందాం!" "మీ యిష్టం!" "ఇక్కడయితే మన మాటలు ఎవరూ వినరు." రావుగారు

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.