అర్ధరాత్రి ఆర్తనాదం 14
telugu stories sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 14 అది అలా జరగాలని వుంటే జరుగుతుంది. ఎవరూ ఆపలేరు. విధి నిర్ణయం అంటారు. సరీగా ఇప్పుడు అదే జరుగుతోంది.
రావుగారు వెళ్ళేసరికి అంతపెద్దయింట్లో దామోదరం ఒక్కడే వున్నాడు.
"పాతికవేలు తెచ్చావా?" ఏక వచనంలొ సంబోధిస్తూ అన్నాడు దామోదరం.
ఆ విషయం గ్రహించాడు రావుగారు.
"మర్యాద మరచిపోయినట్టున్నానే! చూడబోతే ఏరా! అని పిలిచేటట్టుకూడా వున్నావు దామోదరం!" అంటూ వచ్చి అతని ఎదురుగుండా సోఫాలోవచ్చి కూర్చున్నాడు రావుగారు.
"త్వరలో నీ అంతటివాడిని కాబోతున్నాను. పేరు పెట్టి పిలవటంలో తప్పేమివుంది." అన్నాడు దామోదరం.
డైరెక్ట్ గా విషయంలోకివచ్చి సూటిగా అడిగాడు "ఆ ఫోటోలేవి?"
"పాతికవేలూ తెచ్చావా?" దామోదరం అడిగాడు.
"ఆడినమాట తప్పడం ఈ రావుకిలేవు. ఇవిగో పాతిక వేలు" అంటూ పేర్చిన నోట్ల కట్టలను చూపించాడు రావుగారు.
"నువ్వేమీఅనుకోకు. ఒక్క ఫోటోనే తీసుకువచ్చాను. ఒకటి ఇవ్వాళ ఇస్తాను. రెండోది రేపు ఇస్తాను."
"అలా ఎందుకు?" రావుగారు అడిగారు.
"ఒకేసారి నీకు 50వేలు తీసుకురావటం కష్టమవుతుందని అన్నాడు దామోదరం.
"ఇది చాలా మోసం, అన్యాయం" అన్నాడు రావుగారు.
"హత్యచేసినదానికన్నా పెద్ద నేరమా!"
కోపం పట్టలేక రావుగారు "నిన్నూ....నిన్నూ...." అని మిగతా మాట మింగేశారు.
దామోదరం గలగలమంటూ నవ్వాడు. "నీలాంటి పెద్దవాళ్ళు అవసరం వచ్చినంతవరకే మాబోటివాళ్ళని వాడుకుని, ఆపై చంపిపారేస్తారు మీ అవసరం తీరాక అని తెలుసు నాకు. ఒకవేళ నువ్వే చంపే వుద్దేశ్యం పెట్టుకుని వచ్చావేమో! తొందరపడి అంతపనిచేయకు. లేనిపోనిది నీ కొడుకుతో పాటు నీకూ చావు వచ్చిపడుతుంది. నీకొడుకు ఏ జాగ్రత్తలూ