అర్ధరాత్రి ఆర్తనాదం 15

By | December 21, 2022
telugu stories sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 15 నేను ఒక్క చిన్న నాటకం ఆడాను. ఈహత్య గురించి నాకు తెలుసునంటూ ఫోటోలు, క్యాసెట్ నా దగ్గర ఉన్నా యంటూ బ్లాక్ మెయిల్ పేరుతో వ్యవహరిస్తూ నేను కిరణ్ కి ఒక బెదిరింపు లేఖ రాశాను. ఆ దెబ్బతో కలుగులో ఎలుకలకి చలనం వచ్చింది. కాని బయటకు రాలేదు. నేను ఇన్ స్పెక్టర్ సహాయం అర్ధించి నాటకరంగంలోకి ప్రవేశించాను. ఇన్ స్పెక్టర్ నా భుజంతట్టి "గో ఎ హెడ్" అన్నారు. నాటకం తయారుచేశాను. స్టేజికూడా చాలా ఖరీదైనదిగా తయారయింది. చేతిలో కారు, ఎవరూలేని ఖరీదయిన పెద్ద భవంతి ఐదువేల క్యాషూ మార్చుకున్న నా రూపముతో పాండే పేరుతో, దామోదరాన్ని కలుసుకున్నాను. ఈవిధంగా........................................................... .............................................................................................నా చెల్లెలు శాలిని అని, కిరణ్ ఆమెని హత్య చేశాడు అని కామినీ దగ్గర ఆధారాలు వున్నాయని తీసుకురమ్మని చెప్పాను. ఈ విషయంలో కామినీ దామోదరం పోట్లాడుకున్నారు. ఆ మాట అని రికార్డు చేశాము. నేనే దొంగ ఫోటోలు తయారుచేయించి, మొహంవుండేచోట కిరణ్ తలవరకూ వున్న ఫోటోలను తీసుకువెళ్ళి దామోదరం ఇంట్లోనే వుంచాను. ఆ ఫోటోల్లో ఒకటి తీసుకుని రావుగారిని ఫలానా చోటకి రమ్మని దామోదరం ఫోన్ చేశాడు. కలుగులో ఎలుక లన్నీ బయటకు వచ్చాయి. ఫోన్ కాల్ మేము కూడా వినటం జరిగింది. రావుగారి వెనుక నే కిరణ్ వస్తాడు. రావుగారు, కిరణ్, దామోదరం మాట్లాడుకుంటూ వుంటే ఆ మాటలు రికార్డు చెయ్యొచ్చు అనుకొన్నాము. ఒకవేళ అవసరం అయితే అక్కడే పట్టుకోవచ్చు అనుకొని నేనూ, ఇన్ స్పెక్టర్, ఇంకో ఇద్దరు పోలీసులు ఆ యింట్లోనే ఒక మూల దాక్కున్నాము. వాళ్ళ సంభాషణని రికార్డుచేస్తున్నాము. కలుగులోని మరో ఎలుక కామినీ కూడా రంగంలోకి వచ్చింది. కానీ మేము ఆమె వస్తుందని అసలు అనుకోలేదు. కామినీ రావడంతో ఆమె, దామోదరం కలసి రావుగారికి ఎదురు తిరిగారు. వాళ్ళని బెదిరించడానికి అన్నట్లు రివాల్వర్ తీశారు రావుగారు. దామోదరం తన చేతిలోని బ్రీఫ్ కేస్ ని రావుగారి చేతిమీదకు విసిరేయడంతో దామోదరం ఆయన చేతినుండీ అయితే మృత్యుఉని తప్పించుకున్నాడు గాని కిరణ్ చేతిలో తప్పించుకోలేకపోయాడు. ప్రతి చిన్న విషయానికీ ఆవేశపరుడైన కిరణ్ కోపం పట్టలేక తన జేబులోని రివాల్వర్ పైకితీసి టపటపా దామోదరాన్ని కాల్చివేశాడు. మేము ఇది ఊహించలేదు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. చాటుగావున్న ఇన్ స్పెక్టర్ గారి చేతిలో వున్న రివాల్వర్ రావుగారిచేతిని చూస్తూవుంది కాని, కన్ను మూసి తెరిచేలోగా కిరణ్

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.