అర్ధరాత్రి ఆర్తనాదం 3

By | August 11, 2022
telugu stories kathalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 3 శవాన్ని చూసి తనూ నలుగురితోపాటు ఆశ్చర్యపోవటం, ప్రక్కగదిలో అతనిని తను చూసానని గుర్తులు చెప్పటం, నోటికి వచ్చిన అబద్దాలు ఆడేస్తాడు. రెండు రోజులకి శవం బయట పడకపోతే తను మామూలుగా హోటల్ రూమ్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తాడు. అక్కడితో చాప్టర్ క్లోజ్. తనను ఎవరు అనుమానించరు. హోటల్ లో శవం బయటపడి, ఎప్పటికో తెలుసుకున్నపుదు హోటల్ సిబ్బంది మొత్తం లబలబ లాడాల్సిందే. ఎవరు ఎలా ఛస్తే తనకెందుకు? తను క్షేమంగా బయటపడుతున్నాడు అది చాలు. తన ప్లాన్ అద్భుతమైనది. తన అదృష్టం చాలా గొప్పది. "బ్లడీ బీచ్ నాకే ఎదురు తిరుగుతుందా! అనితలోని వగరూ, పొగరు చూసే తను ఆమెమీద వల విసిరాడు. చేపపిల్ల గాలానికి తొందరగానీ చిక్కింది కాని, అది చేపపిల్ల కాదు మొసలిపిల్ల అని తన అనుభవంలో తొందరగానే గ్రహించగలిగాడు. అవసరంవస్తే అందరి ఆడపిల్లల్ని బెదిరించినట్లే బెదిరించవచ్చు అనుకున్నాడు. అప్పుడు అనిత నాలుగుతిట్టి తన జీవితం నుండి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ శాశ్వతంగా పైకి పంపించక తప్పలేదు. తను ఆడపిల్లల జీవితాలతో చాలా తేలికగా ఆటలు ఆదుకున్నాడు. అలానే చాలా తేలికగా వదుల్చుకున్నాడు. తను చాలా మందిని చావగొట్టి చెవులు మూసినంతపని చేశాడు. కానీ ఎవరిని చంపలేదు. కానీ ఇప్పుడు అనితను కూడా చంపలేదు. అనితే తన మృత్యువుని చేజేతులారా ఆహ్వానించుకుంది. తనని రెచ్చగొట్టింది. దాంతో విసురుగా అవతలకి త్రోశాడు. దెబ్బ తగులుతుందనుకున్నాడు గాని, చస్తుందని అనుకోలేదు. చచ్చివూరుకుంది. తను కావాలని చెయ్యకపోయినా, హత్య హత్యే, హంతకుడు హంతకుడే. హత్య చేసినాకూడా తను తప్పించుకు తిరగగలనని నిరూపించుకోవాలి. ఇది తను ఛాలెంజ్ గా తీసుకోవాలి." ఛాలెంజ్ గా తీసుకోవాలి అనుకోగానే కిరణ్ కి ఎందుకో తృప్తిగా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.