అర్ధరాత్రి ఆర్తనాదం 4

By | August 15, 2022
telugu stories kathalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 4 "డాడీ, అన్నమాట ప్రకారం రేపు నా భార్యతో వస్తాను. బై బై" అంటూ కిరణ్ ఫోన్ పెట్టేశాడు. తనెక్కడవున్నాడో తెలియక, తను చెప్పిన మాటలవల్ల మమ్మీ, డాడీ ఎంత ఆందోళన చెందుతారో, ఏవేవో వూహిస్తూ, ఎన్నో రకాలుగా అనుకుంటూ వ్యధచెందుతూ వుంటారు. ఇవన్నీ కిరణ్ కి తెలియక కాదు. ప్రస్తుతం కిరణ్ నిండా మునిగి వున్నాడు. నిలువులోతునీళ్ళల్లో మునిగి నిలుచున్నవాడు, చలి గురించి ఆలోచించడు. కిరణ్ కూడా ఆలోచించటం లేదు. అదయిన తరువాత ఇరువురు కలిసి హోటల్ కు వచ్చారు. రాత్రివరకూ మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారు. పెళ్ళి చేసుకోవటానికి, ఈ హోటల్ నుండి బైటికి వెళ్ళేముందే పధకాన్ని అమలు జరిపింది. కామిని ఒక్కొక్కపనిచేస్తూంటే ఆమె తెలివికి ఆశ్చర్యపోక తప్పలేదు కిరణ్ కి. అంత తెగింపు, చొరవ, ధైర్యం వున్నది తన జీవిత భాగస్వామిని కాబోతున్నది, ఆ విషయం భయాన్ని కలుగచేస్తున్నది కాని, సంతోషాన్ని కలుగజేయటంలేదు. ఇరువురు హోటల్ నుండి బయటకు వెళ్ళేముందు... "నే చేస్తున్నది నువ్వు చూస్తూ వుండు" అంది కామినీదేవి. కూర్చున్న చోటునుండి కదలకుండా "వూ" అన్నాడు కిరణ్. కామినీదేవి లేచివెళ్ళి గోడవైపు తిరిగివున్న అనిత డెడ్ బాడీని ఇటువైపుకి త్రిప్పుకుంది. "ఓహ్ మంచి పిట్టనే పట్టావ్" అంది. కిరణ్ మాట్లాడలేదు సోఫాకి అతుక్కుపోయి కూర్చున్నాడు. "ఇంత అందమైన ఆడదాన్ని చంపటానికి చేతులెలా వచ్చాయ్ కిరణ్" సారీ తొందరపడి మాటన్నాను. ఇది పొరపాటున జరిగిన హత్య కదా! పిచ్చిగా వాగకూడదనుకుంటాను. వెధవ నోటి తొందర ఏదో ఒకటి అంటున్నాను. సారీ కిరణ్" లాలనగా అంది కామినీదేవి. అప్పటికీ ఏమి మాట్లాడలేదు కిరణ్. అనిత చీరను విప్పుతూ "స్టన్నింగ్ బ్యూటీ" అంది కామినీదేవి. అంతవరకు నోరు మూసుకున్న కిరణ్ "ఎందుకు చీర

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.