అర్ధరాత్రి ఆర్తనాదం 6

By | September 12, 2022
telugu stories kathalu అర్ధరాత్రి ఆర్తనాదం 6 "ఈ చనిపోయిన ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు సార్. "అదిగో మళ్ళీ...." అన్నాడు ఇన్ స్పెక్టర్. "నన్ను కంగారుపెట్టకండి సార్. పూర్తిగా చెప్పనివ్వండి. మధ్యలో నాకు అడ్డువస్తే చెప్పేది కూడా మరచిపోతుంటాను." "అడ్డురాను" అన్నాడు ఇన్ స్పెక్టర్. "నిజంగా ఆ అమ్మాయియెవరో నాకు తెలియదు సార్. కాని, చూశాను. నేను మా యింట్లో కిటికీదగ్గర కూర్చుని ఏమీ తోచక ఈ హోటల్ వైపు చూస్తూ వుండిపోయాను. ఈ హోటల్ లో థర్డ్ ఫ్లోర్ లోని వెనుకవైపు కిటికీలు ఒక రూమ్ ని తెరుచుకున్నాయి. ఆ సమయంలో మా ఫ్లాట్ లో కరెంట్ పోయింది. కిటికీలు పూర్తిగా తెరిచి ఒక అమ్మాయి అక్కడ నుంచొని వుంది. ఆ అమ్మాయే చనిపోయిన ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కిటికీ పట్టుకుని బయటకు చూస్తూ వుంది. ఒకతను ఆమె వెనుకగా వచ్చాడు. భుజాలు పట్టుకుని తనవైపుకి త్రిప్పుకున్నాడు? వారిరువురు అక్కడ నుంచుని పదేపదే ముద్దులు పెట్టుకున్నారు. వాళ్ళని అలా చూడటం తప్పని తెలిసినా ఆ అమ్మాయి అందం నన్ను ఆకర్షించడంతో అలానే చూస్తూ వుండిపోయాను. వెనుక మా ఫ్లాట్ లొ కరెంటు లేకపోవడంవల్ల మనుషులు లేరనుకున్నారో ఏమో, వాళ్ళా కిటికీ దగ్గరనుండి చాలాసేపు కదలలేదు. బాగా చూడటంవల్ల ఆ పిల్లే ఈ పిల్లని గుర్తుపట్టాను. అంతేసార్ నాకేం తెలియదు." గోవిందరావు చెప్పాడు. "మీ గదిలో కిటికీదగ్గర నుంచుంటే ఈ హోటల్ రూమ్ లొ జరిగేవన్నీ కనపడతాయా?" "ఊహు....రెండు రూమ్స్ మాత్రమే బాగా కనపడతాయి. అదైనా కిటికీ దగ్గరకు బాగా వస్తే రూమ్ లొ మనుష్యులు కనపడరు. పైగా కిటికీలు పూర్తిగా తీసే కనపడతారు. కానీ కిటికీలకు ఎప్పుడు కర్టెన్స్ వేసి వుంటాయి. ఆ అమ్మాయి పూర్తిగా కిటికీలు తెరచి, కర్టెన్స్ తొలగించడం వలన చక్కగా కనపడింది. అప్పుడు ఆమె ఏ డ్రస్సులో వుందో వర్ణించగలవా?" "అమ్మాయి తెల్లగా మెరిసిపోతున్నది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.