అర్ధరాత్రి ఆర్తనాదం 7
telugu stories kathalu novels అర్ధరాత్రి ఆర్తనాదం 7 "పాతిక బాటిల్స్ అమ్మో..." అంటూ నోరు తెరిచేవాడు గోవిందరావు.
"పాతిక నాకొక లెక్కకాదు. ఏ షాపు వాడికి కబురుచేసినా తెచ్చి ఇంట్లో పదవేస్తాడు. ఆ మాత్రం సత్తా లేకపోతే ఈ పోలీసు ఉద్యోగం ఎందుకు?" నవ్వుతూ అన్నాడు కనకారావు.
ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకొని గోవిందరావు, మరోసారి "నిజమే చెప్తున్నారు కదూ!" అన్నాడు.
"నా మదర్ మీద ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఇంకా అంతకన్నా ఏమి చెబుతున్నాను."
గోవిందరావు గబుక్కున "మీ మాటలు నమ్ముతున్నాను," అంటూ కనకారావు చేతులు పట్టుకున్నాడు.
"స్నేహంలో ఆ నమ్మకమే వుండాలి. మీరీ విషయం మీ భార్యతో చెప్పొద్దు. ఎందుకు చెప్పవద్దంటున్నానంటే. మీలో మళ్ళీ ఏదో అనుమానం రేకెత్తించి మనలను వేరుచేస్తుంది." అన్నాడు కనకారావు.
అవునన్నట్టు తల ఊపాడు గోవిందరావు.
మరో పది నిముషాల తరువాత వాళ్ళ పార్టీ ముగిసింది.
తరువాత వెళ్ళటానికి లేచాడు గోవిందరావు.
బజారునుంచీ వస్తూ కొన్న విస్కీ బాటిల్ ని బలవంతానా గోవిందరావు చేతికిచ్చాడు కనకారావు. ఒక ప్రక్క వద్దు వద్దంటూనే మనస్సు ఆటే పీకుతుండగా, బాటిల్ ని అందుకున్నాడు.
కనకారావు దగ్గర శలవు తీసుకున్నాడు.
తను పార్టీ చేసినట్టు గోవిందరావు భార్యకు చెప్పడు. త్రాగుబోతులకి భార్య మాటలకన్నా పాతిక సీసాలే విలువైనవి. ఆ విలువ పోగొట్టుకోరు, వెడుతున్న గోవిందరావుని చూస్తూ అనుకున్నాడు కనకారావు.
కనకారావు గాలిలో ఒక బాణం వదిలాడు.
అది తగిలి తీరుతుంది.
ఆ నమ్మకం పోలీసు కనకారావుకి వుంది.
15
ఏడూ పది నిమిషాలు.
కనకారావు డ్యూటీనుండి ఇంటికి బయలుదేరాడు. పోలీస్ స్టేషన్ కి అతని రూమ్ దూరమేమీకాదు. ఈల పాట పాడుకుంటూ తాపీగా నడచి పోతున్నాడు.
పది నిమిషాల తరువాత కనకారావుకి