అర్ధరాత్రి ఆర్తనాదం 8

By | September 22, 2022
telugu stories kathalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 8 "గమనించాను." "అయితే గమనించి కూడా చూస్తూ వూరుకున్నారన్న మాట." "కొన్ని వూరుకోక తప్పదు. వూర్కోవడమే మంచిది కూడా. "మీరు...మీరేనా! ఇలా మాట్లాడుతున్నది" చాలా ఆశ్చర్యంగా అంది ఊర్మిళాదేవి. "నేను నేనే, కాకపోతే నటిస్తున్నాను." "మీరు నటిస్తున్నారా! ఎందుకు?" "చెప్తాను. ముందు నీ విషయం చెప్పు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు." "నేనైతే దాన్ని బాబాయ్ గాడ్ని నాలుగుకడిగి, ముక్క చివాట్లుపెట్టి నువ్వు బజారు రకానివి. నీ బాబాయ్ కేమో గుర్రపందాలు, పేకాటపిచ్చి. మీ ఇద్దరూ బయటకు వెళ్ళి అరచిచావండి, అడుక్కొని తినిచావండి. ఎలా చచ్చినా మాకు అక్కరలేదు. వెధవేషాలువేస్తే మాత్రం పోలీసులకి పట్టిస్తాం. లేకపోతే రౌడీలచేత మిమ్మల్ని చావ చితకకొట్టిస్తాం. అని బెదిరించి మెడబట్టుకొని బయటకు గెంటేయాలి. మన మాటలకు అది భయపడిందా సరే లేక అల్లరిచెయ్యటానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ రౌడీనో పంపించి నాలుగు తన్నించాలి. దాంతో అది నోరుమూసుకుంటుంది. మనకి సంఘములో డబ్బు, పరువు, పేరు ప్రఖ్యాతి అన్నీ వున్నాయి. కిరణ్ కి మంచి కుటుంబంలోని పిల్లనిచ్చి సలక్షణంగా వివాహం చేద్దాము. చాలా తేలికగా చెప్పింది ఊర్మిళాదేవి. రావుగారు పైకే పక్కున నవ్వాడు. ఈ మధ్యకాలములో ఆయన అలా మనస్ఫూర్తిగా నవ్వింది లేదు. ఊర్మిళాదేవి తెల్లబోయి భర్తవైపు చూసింది. "నువ్వు ఒక్క నిమిషంలో చెప్పినంత తేలికగా ఈ వ్యవహారం పూర్తికాదు. కిరణ్ ఆ పిల్లనేమీ అననివ్వటం లేదు గమనించావా!" "గమనించాను కాబట్టే ఈ బాధ." "ఇప్పుడర్ధమైందికదా! కామిని మనవాడిని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నది అంటే, వాడు ఏదో తీవ్ర విషయంలో భయపడి కామినీకి లొంగిపోయినట్లు తెలియడంలేదా! కామిని ఏదో విషయంలో కిరణ్ ని బెదిరిస్తున్నది. అంతవరకూ

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.