అర్ధరాత్రి ఆర్తనాదం 9

By | October 22, 2022
telugu stories kathalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 9 కామినీని తను అంతంచేసినట్లు ఏ చిన్న సాక్ష్యాధారం వుండకూడదు. ప్రమాదములో మరణించినట్లు పధకం రూపొందించాలి. ఆ పధకాన్ని ఎలా రూపొందించాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్. ఆ ఆలోచన అలా సాగుతూ ఉండిపోయింది. దానికో రూపం అంటూ ఏర్పడలేదు. 20 కిరణ్ వెళ్ళేసరికి జగదీష్ ఇంట్లోనే వున్నాడు. కిరణ్ ను చూస్తూనే జగదీష్ కిరణ్ కు ఎదురువచ్చి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు. జగదీష్ వుండేది ప్రక్కవూళ్ళోనే. కిరణ్, జరదీష్ మంచి ఫ్రెండ్స్. కలిసి అల్లరిపనులు చాలానే చేశారు. జగదీష్ కాలేజీలొ చదువుతూండగానే అతడి తండ్రి హార్ట్ ఎటాక్ తో హటాత్తుగా మరణించడముతో అతను చదువు మధ్యలో కాలేజీకి గుడ్ బో బై చెప్పక తప్పలేదు. తండ్రి వదిలి వెళ్ళిన బిజినెస్ ను చూస్తూ ఇంటిపట్టునే వున్నాడు. జగదీష్ ది పక్కవూరే కాబట్టి మొదట్లో తరచూ కిరణ్ అతని దగ్గరకువెళ్ళి ఒక రోజంతా అతని ఇంట్లో వుండి రావడం చేస్తుండేవాడు. తరువాత తరువాత నెలకి, రెండునెలలకి, ఒకసారి కలుసుకోవటం మొదలుపెట్టాడు. ఈ మధ్య వాళ్ళిద్దరూ కలుసుకుని నాలుగునెలలపైనే అయ్యింది. ఇప్పుడు కిరణ్ జగదీష్ ని కలుసుకోవటానికి వచ్చాడు. జగదీష్ ని వాళ్ళింట్లోనే కలుసుకున్నాడు కిరణ్. "మీ వాళ్ళంతా ఏరి! కుర్చీలో కూర్చుంటూ అడిగాడు కిరణ్. "అందరూ మ్యారేజ్ కి వెళ్ళారు. రెండురోజులబట్టీ మహా బోర్ గా వుంది- సమయానికి వచ్చావురా కిరణ్." "అయితే మనకి కావలసినది స్వేచ్చ అన్నమాట." నవ్వుతూ అన్నాడు కిరణ్. "మనకి ఎప్పుడు స్వేచ్చ లేదోయ్?" మనకి మించిన ఫ్రీబర్డ్స్ ఎక్కడ వున్నారో చెప్పు!" కిరణ్ చెప్పలేదు కాని, కొద్దిగా ఆలోచించాడు. "తను ఎన్నిసార్లు వచ్చినా ఈవూరు, జగదీష్ బిజినెస్ పనులమీద తలమునకలయి అయినా వుండేవాడు. లేకపోతే ఇంటినిండా వాళ్ళవాళ్ళన్నా వుండేవాళ్ళు. తను బయలుదేరిన వేళమంచిది జగదీష్ తో ఒక గంట వంటరిగా మాట్లాడాలనుకున్నాడు. అతనితో మాట్లాడితే తనకు మనశ్శాంతిగా వుంటుంది....అని ఎన్నో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ జగదీష్ ఒంటరిగా వున్నాడు. జగదీష్ ని మాటలలో పెట్టి..." "ఏంటిరా కిరణ్ అంత దీర్ఘాలోచనలో పడ్డావ్!" "ఆలోచిస్తున్నాను." "ఆలోచిస్తున్నావని తెలుస్తూనే వుందోయ్! ఏమిటి ఆలోచన అని అడుగుతున్నాను." జగదీష్ చిరునవ్వుతో అడిగాడు. "మనం గతంలో గడిపిన కొన్ని తియ్యని సంఘటనలు

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.