ఫస్ట్ క్రష్ 3

By | November 2, 2022
telugu stories sahithi ఫస్ట్ క్రష్ 3 థాంక్ యు విజ్జీ. నాకూ చాలా హ్యాపీ గా ఉంది నిన్ను మీ నాన్న గారిని కలవడం అన్నాడు. ఏమన్నా జూస్ చెప్పనా. ఫ్రెష్ లైం లాంటివి. ఇపుడేం వద్దు. రేపు ఏమి వంటలు చేయించమంటావు. నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు. సింపుల్ గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్ గా సరిపెట్టరు. నీ ఇష్టం. ముందే చెపుతున్నా అంది విజిత నవ్వుతూ. ఆ ముగ్ద మనోహర నవ్వుకు వినీల్ మనసు పెండ్యులం లా అటూ ఇటూ ఊగుతోంది. దాన్ని పట్టుకుని ఆపడం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా. ప్రొద్దున్నే ఫార్వర్డ్ చేసాను. అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీ గా ఉన్నారట. రెండు మూడు రోజులు పట్టొచ్చని చెప్పారు. ఓహ్ గుడ్. ఆ విషయం సక్సెస్ అవ్వాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను నీల్ అంది. వినీల్ మోహంలో నీరసం కనిపించి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయి. ఎందుకబ్బాయి. ఎందుకలా. ఈకాలంలొ కూడా నీలాంటి అబ్బాయిలున్నారా అని సందేహం కలుగుతుంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత. ఏమో విజ్జీ స్నేహం ఒకే కానీ, నీతో పెళ్లంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది. మీ నాన్నగారి తో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తోంది. నువ్వూ కొంచెం ఆలోచించు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు. నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్ధం కావడం లేదు అని తలపట్టుకున్నాడు. నీల్ ప్లీజ్. అలా మాట్లాడకు. ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటిరోజే నువ్వు నాకు ఎంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకుని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.