ఫస్ట్ క్రష్ 4

By | November 11, 2022
telugu stories kathalu sahithi ఫస్ట్ క్రష్ 4 వర్రీ కావాలసిన పనిలేదు. రాజు గారు ముందు జాగ్రత్తగా నే ఉన్నారు. అందుకే పెద్ద ఆపద తప్పింది. వినీల్ కి డౌట్ వచ్చి యశ్వంత్ ని అడిగాడు. వాళ్ళు ఇలాంటివి రిపీట్ చేస్తే కష్టం కదా. ఎన్ని రోజులని ఇలా జాగ్రత్తపడాలి. ఎటునుంచి ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే వినీల్. అందుకే రేపు పొద్దున మళ్ళా నేను వస్తాను. అప్పటికి రాజు గారు స్పృహలోకి వచ్చి మాట్లాడుతారు కాబట్టి ఆయనతో డీటెయిల్ గా మాట్లాడి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాను. నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీనిపై సమగ్ర రిపోర్ట్ కూడా డీ జీ పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సీరియస్ గా ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రాజు గారికి ప్రత్యేక రక్షణ కల్పించామని ఆదేశాలు ఉన్నాయి. అందుకే ఆరునెలలుగా ఆయన కారు వెంటే మా ఎస్కార్ట్ వెళుతూ ఉంటుంది. రాజు గారి ఇంటి వద్ద కూడా మఫ్తీ లో పోలీస్ నిఘా ఉంచాము. కాకుంటే శత్రువులు ఓక టెండర్ విషయములో రాజు గారికి అది రావడంవల్ల కోపం గా ఉన్నారు. వారిని పూర్తిగా హెచ్చరించాము. ఇక భయమేమీ ఉండదు. మీరేమీ కంగారు పడకండి. లీగల్ గా వారిపై ఎలా ఆక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ ప్లాన్ చేసాము. వారంలోపే వారందరి మీదా ఛార్జ్ షీట్ వేస్తాము అని చెప్పాడు. మరి నేను వెళతాను. రేపు ప్రొద్దున మీకు ఫోన్ చేసి వస్తాను అని విజిత నెంబర్ తీసుకున్నాడు యశ్వంత్. అందరూ లేచారు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఇంకేంట్రా వినీల్ ఏంటి విశేషాలు అని అడిగాడు యశ్వంత్. ఎంతవరకు వచ్చింది నీ మ్యారేజ్ ప్రొపొసల్స్ అని ఆప్యాయంగా నీల్ ని దగ్గరకు తీసుకుని అడిగాడు. డాడీ చూస్తున్నారు అన్నయ్య అని చెప్పాడు వినీల్. మళ్ళీ ఆ జాతకాల గోలేనా. త్వరగా చేసుకోరా బాబు ఎవరినో ఒకరిని చూసుకుని. దగ్గరలోనే కూర్చుని ఉన్న విజిత వీరి సంభాషణ వింటోంది ఆసక్తిగా. తప్పకుండా అన్నయ్య. కానీ నీకు తెలుసు కదా. నాన్నకు ఎదురు వెళ్లలేము అన్నాడు. తెలుసురా. అందుకే మీ అన్నయ్య విషయంలో జాతకం కుక్

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.