ఫస్ట్ క్రష్ 5

By | November 20, 2022
telugu stories sahithi ఫస్ట్ క్రష్ 5 స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావలసిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది. అందులో రెండు లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకుని ఆ లాలీ పాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరూ చూడకుండా. మూడు కుక్కలూ వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి. వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది విజిత నవ్వుతూ. వినీల్ చేతికి స్వీట్స్ బాక్స్ ఇచ్చింది. వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. వినీల్ అని పిలిచారు రాజుగారు. చెప్పండి సర్ అన్నాడు పక్కన ఉన్నా. రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు. రేపు మధ్యాన్నం వెళ్లి ఎల్లుండి రిటర్న్ వచ్చేయొచ్చు ప్లీజ్ అన్నాడు. పెద్దాయన మొదటి అసైన్మెంట్. ఏం చేద్దాం తప్పేట్లు లేదు అనుకున్నాడు వినీల్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ మొహమాటం డామినేట్ చేస్తోంది. నేను పి ఏ కి చెప్పి రేపు మధ్యాన్నం ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పిక్ అప్ చేసుకుంటుంది అన్నాడు. సరేనండి అన్నాడు వినీల్. ఏమ్మా విజ్జీ ఏమంటావు అని అడిగాడు. సరే డాడ్. వెళతాము అంది వినీల్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు. తనేమైనా ఇబ్బందిపడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది. అలాంటిదేమీ లేదు. అమ్మయ్య అనుకుంది. వంటావిడ వంట రెడీ అని చెప్పింది. వెళ్ళు నీల్. నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్ లో ఇన్వైట్ చేసాను. ఇదిగో ఇలా బెడ్ కి పరిమితం అయ్యాను. మా ఆవిడ, అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ. అయ్యో ఫరవాలేదు సర్. డైనింగ్ టేబుల్ పై చాలా వంటకాలు ఉన్నాయి. వాటిని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.