ఫస్ట్ క్రష్ 6
telugu stories sahithi ఫస్ట్ క్రష్ 6 సర్. ఇక్కడ సర్ వాళ్ళ ఇంట్లో టి వి లో లైవ్ టెలికాస్ట్ సెట్ చేసాను. ఓ కే అయ్యింది అన్నాడు ఆనందంగా.
స్పీకర్ ఆన్ చేసి రాజుగారు ముందు పెట్టాడు పి ఏ. ఆయన కూడా ఆనందంగా థాంక్స్ చెప్పాడు వినీల్ కి.
వినీల్ ఫోన్ విజితకి ఇచ్చాడు.
డాడీ మాట్లాడటం విని ఆనందంగా హాయ్ డాడ్ అంది విజిత.
ఆయన మాట్లాడుతూ లైవ్ టెలికాస్ట్ సెట్ చెయ్యడం, అందుకు వినీల్ హెల్ప్ చెయ్యడం అన్నీ చెప్పాడు. నేను, మమ్మీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాము. మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడున్నారు. మిగతా వాళ్ళు ఫ్యాక్టరీ లో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారు అని చెప్పాడు. వినీల్ మన టెక్నికల్ స్టాఫ్ ని పొద్దున్నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అన్నాడు. బెస్ట్ విషెస్ విజ్జీ. ఎంజాయ్ ది పార్టీ అమ్మలూ అని బై చెప్పాడు.
థాంక్స్ వినీల్ అంది అతని మొహం వైపు చూస్తూ.
కోపం ఛాయలు మచ్చుకు కనపడలేదు.
వినీల్ కి పని దొరికితే పండగే. అందులో పరకాయ ప్రవేశం చేసి లీనమై పోతాడు.
అమ్మయ్య అనుకుంది అతన్నే చూస్తూ.
వినీల్ దగ్గరికి వ్యాఖ్యాత గా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతోంది.
వినీల్ ఆమెకు అన్నీ వివరంగా చెప్తున్నాడు. థాంక్స్ సర్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది.
ఆరు గంటల కల్లా మంత్రిగారు, ఛాంబర్ అఫ్ కామర్స్ పెద్దలు అందరూ వచ్చేసారు.
డయాస్ పై తమకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు.
ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్లున్నారు. హాలు బాగానే నిండింది.
విజితకు సన్నగా వణుకు మొదలయ్యింది.
వినీల్ తో చెప్పింది డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ. ప్లీజ్ రా అంది రిక్వెస్ట్ చేస్తూ అతని చెయ్యి పట్టుకుని.
నీకేం భయం లేదు విజ్జీ. నేను అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు.
ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు.
ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ విజి ఇండస్ట్రీస్ వెంకటరాజు