ఫస్ట్ క్రష్ 7
telugu stories sahithi ఫస్ట్ క్రష్ 7 నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను. ఆయన కాదనరు. ఆయనకు ఇప్పటికే నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది. నాకంటే నువ్వే ఎక్కువయ్యావు. ఆయన ప్రాణదాతవు కదా నువ్వు అంది నవ్వుతూ.
సరే నీ ఇష్టం అన్నాడు.
ఇక రా నిద్రపోదాం అంది తన పక్కనే మంచంపై చోటు చూపిస్తూ.
మొహమాటపడుతూ మెల్లగా విజిత పక్కన చేరాడు వినీల్.
ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా జరిగి గువ్వా గోరింకల్లా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడి పడుకున్నారు. అంత ఏ సి చల్లదనంలోనూ వెచ్చగా అనిపించింది ఇద్దరికీ.
ఇద్దరూ ఒక్కటయ్యారు.
వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి.
వినీల్ ని పెళ్లి చేసుకునేందుకు విజితకు మార్గం సుగమమయ్యింది. థాంక్ గాడ్ అనుకుంది మనసులో.
నాలుగు గంటలకు మెలకువ వచ్చింది విజితకి.
అయ్యో విజ్జీ సారీ. నేను అలా చెయ్యాలని చెయ్యలేదు అని కలవరిస్తున్నాడు వినీల్.
అతన్ని కొంచెం కదిపింది. కలవరింత ఆగింది. బాగా డిస్టర్బ్ అయ్యినట్లున్నాడు.
పెళ్ళయ్యేంతవరకు నిద్ర కూడా సరిగా పోయేట్లులేడు నీల్ అనుకుంది.
జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్లు నీల్ అన్నాడు. మరి ఆయన ఒప్పుకుంటాడా తమ పెళ్ళికి.
డాడీ ని కూడా ఒప్పించాలి కదా.
అబ్బో చాలా సమస్యలున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారింది విజిత.
ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరు దరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి.
****
అలసిన ఆ ఇద్దరికీ మంచి నిద్ర పట్టింది.