మైదానం 3

By | August 11, 2022
telugu stories kathalu sahithi మైదానం 3 మామయ్య మాటాడకుండా నా వంక రెండు నిమిషాలు చూశాడు. చిన్నప్పుడు నేను పెంకి మాటలు మాటాడినప్పుడు బెదిరించడానికి చూసినట్టు. కాని ఈ తురక రాజ్యంలో ఆ మంత్రం పారక, పైపెచ్చు నేను నవ్వడం చేత, అతనికి తీవ్రమైన ఉక్రోషం ఒచ్చింది. తన బాణాలన్నీ రావణుడి యడల వ్యర్థమయినప్పటి రాముడివలె. "సిగ్గులేదుటే. నీ మొహానికి! అంత మరీ చెడిపోయినావుటే! ఆ తురక వెధవ నిన్ను ఒదలలేకపోవడం ఒక గొప్పగా, బడాయిగా...." "ఒక్క నిమిషం వదలలేని ప్రేమ ననుభవించడం కన్న అదృష్టం యేముంది స్త్రీకీ! నీ కర్థం కాదులే" పళ్లు పటపట కొరికాడు. ఇంకేం చాతగాక! "ఎందు కర్థమైతుంది? కుక్కలమల్లే, పందులమల్లే-" ఇంకేవో మాటలన్నాడు. చెడిపోయినదాన్ని నా నోటి నుంచి కూడా రావు ఆ మాటలు. "పుణ్య పురుషులు, బ్రాహ్మణులు మీరుమాత్రం అంతేగా! కుక్కల కన్న, పందులకన్న, అధమంగా. ఆ మాత్రం చాతగాక-" ఇంక కోపం చూపించే విధం తోచలేదు మామయ్యకి. "పాపం, పుణ్యం-సిగ్గూ, యెగ్గూ లేకుండా రాత్రులనక, పగలనక యీ అడవిలో దున్నలవలె పడి-యెందుకు యీ బతుకు బతకడం యింతకంటె దేంట్లోనన్నాపడి చావరాదూ?" "మొదట్లో నా ప్లీడరు పెనిమిటీ ఓ వారం యిట్లానే వుండేవారు. తరవాత శక్తీ, రసికత్వమూ తగ్గి పవిత్ర పురుషుడైనాడు. ఆయన్ని యేమీ అనరేం!" "పవిత్రమయిన కాపరానికీ, యీ గుడిసేటితనానికీ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.