మైదానం 6

By | September 12, 2022
telugu stories kathalu novels మైదానం 6 "వుండు మీరా." ఆనాడు అమీర్ కొండకింద ప్రవహించే యేట్లోకి నన్ను తోస్తానని బెదిరించాడు. నేనతని మెడ పట్టుకుని వేళ్ళాడ్డమూ, నన్ను కావులించుకుని "అమ్మా! నాదాన్ని, ప్రాణాన్ని, నేను ఒకరవ్వ విడుస్తానా? అనడమూ; ఆ కొండ పెద్ద నల్లరాతి ముందు నన్ను నుంచోబెట్టి తను కొంచెం కిందికి దిగి నన్ను చూస్తూ అక్కడనించే తన ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ వెలిబుచ్చడమూ, పిచ్చిపాటలు పాడుతూ ఆ వెన్నెలనంతా చేర్చి బట్టని చేసి నాకు కట్టుకోడానికి కిస్తానని నవ్వడమూ; నిద్రపోతానంటే వెన్నెల వృధా అవుతుందని చంద్రుడు పచ్చగా పెద్దగా పడమట కుంకే వరకూ మాటిమాటికీ మూతపడే నా కళ్ళని బలవంతంగా తెరిచి చూపుతో వుండడమూ. మీరా యేడీ? లేచి పిలిచాను. ఇంటికి వెళ్ళాడా? లేచి సగం వెతుకుతూ సగం ఆలోచిస్తూ తిరుగుతూ వున్నాను. మీరా కూడా వెళ్ళిపోయినాడా నన్ను ఒంటరిదాన్ని జేసి యీ రాత్రి? ఏటివొడ్డున పడుకుని కనబడ్డాడు యిసుకలో-"మీరా?" కదలలేదు. లేపాను. వూయించాను. ఏడుస్తున్నాడు. మనసుకు తట్టింది? "నీతో మాట్లాడలేదనా? అవునా? చెప్పు. నన్ను క్షమించు. నిజంగా చాలా దిగులుపడుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు అట్లా మరుపు వొస్తే యింత ఆగ్రహిస్తావా! లేదు. ఏం! నిజం అట్లా అనుకుంటావా? కాదు. నిర్లక్ష్యమచేసి కాదు కాదు. కాదు"- "యేమిటి? నువ్వు నాకు చవక కాలేదు. ఎన్నటికీ కావు....నాతో మాట్లాడవా!" "పోనీలే అమ్మా అంత కోపమైతే" నాకు విసుగూ రోషమూ వస్తున్నాయి. అమీర్ లేని బాధ ఎక్కువవుతోంది. అంత అందమైన వెన్నెలకి బలిచేసి వెళ్ళిపోయిన నా నాధుడి క్రూరత్వం నన్ను కోస్తోంది. జీవితం దుర్భరం. జీవితం నిష్ఫలం. నాకింక

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.