మైదానం 7

By | September 16, 2022
telugu kathalu novels stories మైదానం 7 "ఛా! నేననుకోలేదు. దానికికాదు. కానీ ఈ యింట్లో గానీ, హృదయంలో గాని నాకు చోటు లేదు." "వుంది ఎన్నటికీ పోవడానికి వీల్లేకుండా వుంది. నీకేమీ సందేహం అక్కరలేదు." "నిజమా, నిజమా?" "నిజం. ఇంక పిచ్చి పిచ్చి సందేహాలతో బాధపడక రా. రా. ఆడుకుందాం. పువ్వు లేరుకుందాం రా." అతన్ని లేవదీసి నవ్వించి పరుగెత్తి ఇద్దరమూ తంగేడు పువ్వులు కోసుకొంటున్నాము. కాని నా హృదయం భారంతో మూలుగుతూనే వుంది. "నా తలలో పెట్టు." "అమీర్ కి బాగుండేందుకా?" ఏం చెయ్యను? "ఆ మాటలే అనకు. ఇద్దరికీ బావుండేందుకే." తల్లో పెట్టాడు పూలని. మీరా తరహా మారింది. అతని వేళ్ళు నా తల్లో పెట్టాడు పూలని. మీరా తరహా మారింది. అతని వేళ్ళు నా మెడమీద జుట్టుకింద చురుకు చురుకు మంటున్నాయి. పాము పిల్లకి ఎంత పాలుపోస్తేనేం యెప్పుడో వొకప్పుడు పడగ విప్పక మానుతుందా? ఇలా గంటసేపు కాలం గడిపామో లేదో అమీర్ వొచ్చాడు. "ఏం మీరా? వొచ్చావా?" అని లోపలికెళ్ళి పొయ్యి రాజేస్తున్నాడు. మళ్ళీ మా వేపు రాక, నవ్వుతో ఆ వూరు వచ్చిన మందుల వర్తకుడి కబుర్లు చెపుతున్న మీరా చప్పున ఆగాడు. అంతే, కొంచెం సేపట్లో అమీరు వొచ్చి కూర్చున్న తరువాత అసలే మాటలులేవు. ఆ నిశ్శబ్దం దుర్భర మయింది. దూరంగా కూచుని అమీర్ అప్పుడప్పుడు రెప్పలకింద నుంచి దగ్గిరిగా కూచున్న మా యిద్దరి వంకా చూస్తున్నాడు. రాళ్ళతో ఆడుకుంటూ తలెత్తలేదు. మీరా చివరికి ఒక్కమాట మాట్లాడకుండా చప్పున లేచి వెళ్ళాడు. తరువాత రెండు గంటలసేపు అమీరూ మాట్లాడలేదు. యేమిటా యీ వుపద్రవం పెద్ద తుఫాను ముందట. విపరీతమైన శాంతం కాదుగదా అని భయపడుతూ నేను కూచున్నాను, యెండ వంక చూస్తూ. అమీర్ చప్పున 'ఆ' దీదీ యేమిటి? అన్నాడు. "ఏమో నాకు తెలీదు." "పిలిపించుకుంటూ తెలీదేమిటి?" "అది తెలుగూ కాదు. తురకం కాదు నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఏమో ముద్దుకి అట్లా పిలుస్తాడు." "దీదీ దాదా" అని వెక్కిరింపుగా అని యింకా యేదో అనబోయి వూరుకున్నాడు అమీర్. 'దీదీ' అన్నమాట మీరా నోట్లోంచి వొచ్చినప్పటి మాధుర్యమంతా చితికిపోయింది. మళ్ళీ రెండురోజులు మీరా కనపళ్ళేదు. అమీరు కొత్త ప్రేమతో కొత్త కాంక్షతో అన్నీ మరచిపోయినాను. కాని అమీరైనా నాన్ను కావలించుకుని పడుకుని నా మొహంలోకి కళ్ళలోకి చూస్తూ యేదో యేదో స్పష్టంగాని తనసందేహాన్ని నా లోపల, నా హృదయం లోపల కళ్ళలోంచి వెతుకుతున్నట్టుగా చూస్తూ పరధ్యాన్నంతో పడతాడు. చప్పున మళ్ళీ నా అందంలో మైమరుస్తాడు. ఏదో తనని బాధించే అంతర శత్రువులతో పోరాటుతున్నట్టు బాధపడతాడు. నాకతనిపైన, అతని బాధపైన ఎంతో జాలి కలుగుతుంది. కాని అడగటం భయం. అడిగితే ఏం వెళ్ళబెడతాడో? మధ్య మధ్య మీరాని మరిచిపోయినానే! ఎక్కడున్నాడో! మళ్ళీ ఏ పొదల వెనక తిండిలేక మాడుతున్నాడో! రాడేం? అనుకుంటూనే మళ్ళా మరచిపోతాను. మళ్ళీ యెందుకు మరచిపోయినాను? ఎంత క్రూరురాల్ని! నాకేం అధికారముంది యింత అందంగా వుండేందుకు? అని నాలిక కొరుక్కుంటాను. కృతఘ్నురాలినా? నా సౌఖ్యం ముందు ఏ భారాన్నీ అణగ తొక్కేస్తానా? నా గుండె విపరీతమైన రాయా? ఏమో? కాని యిప్పుడు తలుచుకుంటే ఏమనిపిస్తుందంటే- అంతకంటే యేం చెయ్యగలుగుదను? ఎటు ఏమి చేసినా, దోవలేని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.