మైదానం 8 END

By | September 22, 2022
telugu kathalu novels sahithi మైదానం 8 ఎలాగో అతని ముందు నా హృదయాన్ని విప్పి అర్థం చేయించి నాతో సానుభూతిని చూపేట్టు చేస్తే! వెర్రి కలలు. అంత దగ్గిరిగా నడుస్తున్నాము. ఒకరికింకోరు ప్రాణతుల్యం. కాని ఒకరి సంగతి ఇంకోరం అర్థం చేసుకోము. అతని సంగతి తెలిసికూడా నేను అశక్తురాల్ని. నా సంగతి తెలుసుకోలేక అతను అశక్తుడు. ఎందుకిట్లా పుట్టామో! అప్రయత్నంగా, మామూలు తోవనే మాకు తెలీకుండానే మా కాళ్లు మమ్మల్ని కొండమీదికి తీసుకువెళ్ళాయి. అటు వెళ్ళి మా పాత బురుజు చివర కూచుని కాని రాము. ఎంత చీకట్లోనైనా అమీర్ కి తోవ తెలుసు. కళ్ళు కట్టుకుని ఆ పిట్టగోడమీద నడిచి వెనక్కి రాగలడు. గోడ దగ్గరగా వొచ్చామో లేదో ఏదో గోడమీదనించే కిందికి జరజర చప్పుడయింది. "ఏదో పశువో, లేక తోడేలో?" "పాపం చస్తుంది కాదూ?" అంటూ వుండగానే, నా కంఠస్వరంతో కలిసే, కెవ్వున కేక వినపడ్డది- "దీదీ!" అని. "మీరా! మీరా! పడ్డావా ఆ అగాధంలో" వొళ్ళు తెలీక పరుగెత్తాను నేను. "మీరా మీరా! మీరా!" ఇంకేం మీరా! ఎక్కడ వున్నాడు? ఎందుకు అరిచాను? లాభమేమిటి? కొండలన్నీ మీరా నా మీరా" అని వెక్కిరిస్తున్నాయి. కాని అద్భుతంగా ఆ అగాధంలోంచి హీనస్వరం- "దీదీ" అంది. నా చెవులు నన్ను మోసగించాయా, లేక ఏదన్నా భూతం నన్ను వెక్కిరిస్తోందా? లేక అతని ఆత్మ అరిచిందా? ఆ అగాధంలోకి తొంగి చూస్తున్నాను గావును. అమీర్ చెయ్యి నా కంఠాన్ని వెనక్కి లాగింది, పడతావు వొంగకు." అమీర్, పాపం వెనకనే వున్నాడు. "అమీర్! అమీర్! నా మీరా, నా మీరా, నా మీరా" "మళ్ళీ పిలు!" అది కోపమేనా! దడిపిస్తున్నాడా! పిలు. ఏం చేస్తానో అన్నాడా? నాకు ఒళ్ళు తెలీదు. "అమీర్ బతికే వున్నాడు. ఎట్లా! అయ్యో మేరా౧ నేనింక బతకను. ఎట్లా బతకను, మీరా లేంది!" నాలిక కొరుక్కున్నాను. ఆమాటన్నందుకు. అమీరేం చేస్తాడు? సరే. నీ మీరా దగ్గిరికే పొమ్మని మెడపట్టుకు తోస్తాడా? 'మళ్ళీ పిలు' 'మీరా' "దీదీ?" "వున్నాడు, బతికే వున్నాడు....అమీర్ ఏం చేస్తున్నావు!" "వుండు....ఎక్కడ వున్నాడో అడుగు." "మీరా, ఎక్కడ వున్నావు?" "దీదీ, శలవు. మధ్యలో చెట్టుని పట్టుకుని వేళ్ళాడుతున్నాను. నా చేతులు యింక ఆగవు. పడిపోతున్నాను, దీదీ, నువ్వు గొప్పదానివి. నిన్ను చూస్తే....నీకోసం నాప్రాణమన్నా యిచ్చేసేవాణ్ని. నువ్వు

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.