పన్నీటి కెరటాలు 10

By | October 30, 2022
telugu kathalu stories sahithi పన్నీటి కెరటాలు 10 అన్నపూర్ణమ్మ చిలకాకుపచ్చ సన్నటి జరీ వున్న పట్టుచీర కట్టుకొని ఉంది. బర్మా ముడిచుట్టూ పూలమాల పెట్టుకున్నది. ఆమె అసలే పెద్ద బొట్టు పెట్టుకుంటుంది.ఈరోజు ఆ బొట్టుసైజు ఇంకొంచెం పెరిగింది. చేతిలో పూలసజ్జ దానిలో టెంకాయ, పూలు, పళ్ళు పూజాసామాగ్రి ఉన్నాయి. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీశైలం పొట్టినిక్కరు అటు బుష్ కోటు, ఇటు షర్టు కాని ఆకారంలో ఉన్న షర్టు ధరించి ఉన్నాడు. ఇప్పుడు ముదురునీలం పాంటు దాని ఆకారం డబ్బాలా ఉన్నది వేసుకుని ఉన్నాడు. టక్ చేసిన లక్షణం ఎగుడు దిగుడుగా చొక్కా పాంటులోకి దూరి ఉంది, అరవై డెబ్బై రూపాయలికివచ్చే వాచీ చేతికి తగిలించి ఉంది, ముఖాన తిలకంతో పెట్టుకున్న నలుపుబొట్టు ఉంది, దానిక్రింద అడ్డంగా విభూతి పెట్టుకున్నాడు. దానిమీద మళ్ళీ చిన్న కుంకంబొట్టు. కొద్ది సమ్మర్ క్రాఫ్ ఉన్న తలకి బాగా నూనె పట్టించి ముందుకి దువ్వుకున్నాడు. అచ్చం తిరణాలకొచ్చిన కోతిపిల్లలాగా ఉన్నాడు, అప్పటివరకూ నోట్లోవున్న జీడీ తనడం అయిపోయినట్టుంది. 'ఆయ్' అన్నాడు. 'మావాడు ఇప్పుడిప్పుడే మనుష్యుల్లో పడుతున్నాడు' అంది అన్నపూర్ణమ్మ. 'ఇంకానయం బురదగుంటలో పడలేదు' అనుకుంది సరిత. "అమ్మవారి దర్శనం బాగా అయిందా?" మరోసారి అడిగింది అన్నపూర్ణమ్మ. ఆమె అడిగింది సరితని, కానీ వెంటనే జవాబిచ్చింది సతీష్ షా. "మేము ఇంతకుముందే కొండపైకి వచ్చాము, క్యూ తరుగుతుందేమో అని గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఈ జనంలో పడి మా రాణీగారు లోపలికి వెళ్ళరు, నేను ఎంత 'షా' ని అయినా రాణిగారిమాట వినాల్సిందేకదా! 'ఓ....ఓహ్ సతీష్! నువ్వు నన్ను మరీ ఇదిగా అంటే నాకు కోపం వస్తుంది" ముద్దుగా అంది సరిత. ఈలోపల శ్రీశైలం సతీష్ షా లాల్చీ పట్టుకుని దాని నునుపుదనం చూస్తూ 'అమ్మీ' అన్నాడు. "ఏంటిరా నాన్నా!' అంది అన్నపూర్ణమ్మ. "అమ్మీ! ఇది బావుందే. ఇలాంటి చొక్కాయి నాకూ కావాలి" అన్నాడు శ్రీశైలం. 'అలాగే' అంది అన్నపూర్ణమ్మ. "మీ ఫోటో" తియ్యమంటారా?" సతీష్ షా అడిగాడు. "వద్దు. వద్దు ఇలాంటిని మాకు భయం

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.