పన్నీటి కెరటాలు 13

By | November 20, 2022
telugu stories sahithi పన్నీటి కెరటాలు 13 వర్ధనరావు దగ్గరకొచ్చి ఆగాడు రంగనాయకులు. "కొత్త సన్నాసి చేరినట్లున్నాడు!" వాడు అడిగాడు. "ఔ' అంటూ అహోబిలం జోలె లోంచి రెండు రూపాయలు తీసి పిడతకి ఇవ్వబోయాడు. "మీ ఇద్దరూ కొత్త ముఖాలుగా తెలిసిపోతున్నారు. మీరు వేరు వేరు వాళ్ళా, ఒకే తలకాయలా? తలలు వేరయితే వేరువేరుగా డబ్బు తీయండి. ఇద్దరిది ఒకే తలకాయ అయితే నాలుగు రూపాయలు ఇవ్వు" పిడత దబాయింపుగా అడిగాడు. అహోబిలం నాలుగు రూపాయలు తీసి ఇచ్చాడు. "నీ పేరేమిటి కొత్త సన్నాసి?" రంగనాయకులు అడిగాడు వర్ధనరావుని. తన మారు పేరు బాగా గుర్తుపెట్టుకున్న వర్ధనరావు స్వరం కీచుగా మార్చి "అంతే ఆనంద దయానంద పరమానంద సద్గురు సదా భారత భరతానంద్' అంటూ వేగంగా చెప్పాడు. "నీయవ్వ . ఇదేం పేరురా. ఈ వూరు నించి మదరాసు దాకా ఉంది" అంటూ మఠం వూగిపోయేలా నవ్వాడు రంగనాయకులు. "నీ పేరు ఏందిబే?" పిడత దర్జాగా ఓ ఫోజు పెట్టి అడిగాడు. "చిన్న మన్నవెన్న పన్న వెంగళప్ప వేదాంత నాద్" అహోబిలం టకీమని చెప్పేశాడు. "ఓరి నీయమ్మ కడుపు మాడ, ఇవేం పేర్లురా . దొంగకోళ్ళు కొట్టే ముఖాలు మీరూను" అంటూ వాడి శక్త్యానుసారం పిడతగాడు కూడా నవ్వాడు. ఆ తర్వాత మిగతా సన్యాసుల దగ్గర డబ్బు తీసుకుంటూ వాళ్ళిద్దరూ అవతలికి వెళ్ళారు. అందరి దగ్గరా డబ్బులు తీసుకోటం ఆయిం తర్వాత అక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు రంగనాయకులు , పిడతాను. "నీ యవ్వ అని నన్నే తిడతావురా! చెపుతా చెపుతా, నేను డ్యూటీలో జాయిన్ కాగానే ముందు నిన్నే పట్టి , నీ నెత్తిన మొట్టి రెక్కలు విరిచి చేమ్డాలు వలచి ....." అలా కశికశిగా అనుకున్నాడు వర్ధనరావు. "నీయమ్మకడుపు కాల అని తిడతావటరా నన్ను .......నన్ను ..... ఒరే పిడత కందిపప్పు ముఖమా! నీ ముఖం పచ్చడి బద్దలు చెయ్యకపోతే చూడు. ఉఫ్ అంటే గాలికి ఎగిరిపోయే గాడిదకొడకా! ఇప్పుడు కాదురా నీ పని......." కోపంగ అనుకున్నాడు అహోబిలం. "ఇప్పుడొచ్చిన ఇద్దరూ ఎవరు?" ఏమీ తెలియనట్లు అడిగాడు వర్ధనరావు. "రంగనాయకులని పెద్ద రౌడీలే. సన్యాసుల కోసం ఈ మఠం వాడి

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.