పన్నీటి కెరటాలు 14
telugu stories sahithi పన్నీటి కెరటాలు 14 బస్ , నీవేమంటావో అని అలా అన్నాను , సాధనా! నీ ముందు చూపు అమోఘం, అద్భుతం , అందుకే ఈ కేసు నీ కప్పగించటం జరిగింది. నీవు విజయం సాధించి తీరుతావని నాకు తెలుసు"
"నాపై మీకున్న నమ్మకానికి థాంక్స్ బాస్!"
"సుందోపసుందులు మళ్ళీ ఏం చేస్తున్నారు?" ఆర్ష నవ్వుతూ అడిగాడు.
ఆర్ష అడిగింది ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కానిస్టేబుల్ అహోబిలం గురించి వాళ్ళిద్దరికీ ఆ మన సుందోపసుందులని నిక్ నేమ్ పెట్టాడు.
"ఈ తఫా వాళ్ళిద్దరూ మూతికి గుడ్డలు కట్టుకున్న సన్యాసి వేషాలు వేశారు. డ్యూటీ సెలవు పెట్టి సన్యాసుల్లో కలసి తిరుగుతున్నారు" సాధన చెప్పింది.
"సన్నాసి వెధవలు" అర్ష్ ముద్దుగ రవ్వంత వ్యంగ్యం జోడించి తిట్టాడు.
"మీరు పంపిన ఇద్దరు ఇవేళ రేపటిలో ఆ సన్నాసులని కుక్కల్లా వాళ్ళ వైపుకి తిప్పుకుని కోతుల్ని చేసి తిప్పి తిప్పి ఆడిస్తారు లెండి. వాళ్ళ విషయం మనవాళ్ళు చూసుకుంటారు కాబట్టి యింక వాళ్ళ విషయం నా కనవసరం బాస్! చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు, అందుకే సన్నాసులకి కూడా మనవాళ్ళని కాపలాగా పెట్టింది."
"నాకు తెలుసా సాధనా! నీకెంత ముందు చూపు ఉన్నదీను! ఇంక నీ విషయం చెప్పు. ఊరికే ఫోను చెయ్యవు కదా!"
"యస్ బాస్! మన ప్రత్యర్ధులు నాతొ పాటే రంగంలోకి దిగినట్లున్నారు. పైకి మాత్రం ఇద్దరే కనిపిస్తున్నారు. రంగంలో ఉన్నది ఇద్దరు కాదని నా ప్రగడ నమ్మకం. వారి వెనుక చాలానే బలగం ఉండి ఉంటుంది. వాళ్ళ ప్రతిచర్య కనిపెట్టమని వాళ్ళ వెనుకనే మనవాళ్ళలో వకడిని నియమించాను.....
"ఊ.....ఆ తర్వాత .....!"
"నా పని నేను చేసుకుపోతున్నాను "
"ఆపై !"
"ఆపై ఏమీ లేదు బాస్! మారణాయుధాలలో మనవాళ్ళలో కొందరిని ఉద్దండపిండాలని ఏ వేషానికయినా సరిపోయే వాళ్ళని చంపటానికి చావటానికి దేనికీ జంకని వాళ్ళని వెంటనే పంపించండి."
"అలాగే"
కాస్త తొందరగా ....!"