పన్నీటి కెరటాలు 15
telugu stories sahithi పన్నీటి కెరటాలు 15 "నిద్రవస్తున్నది కదాని మనం పడి నిద్ర పోయామనుకో ఏం జరుగుతుంది" రాజయ్య నవ్వుతూ అడిగాడు.
"రాత్రి రెండు గంటలకి ఈ వూరు వచ్చే ప్యాసింజరు బండి వచ్చి వెళ్ళిపోతుంది. మనం తెల్లారి లేస్తాము" తనూ నవ్వుతూ జవాబు ఇచ్చాడు ఉమాపతి.
అదేదో జోకయినట్లు ఈతఫా యిరువురూ పైకి నవ్వారు.
"మనం వక గంట ఇక్కడే విశ్రాంతిగా వూరికే పడుకొందాము. అలాగాక బాగా నిద్ర వస్తున్నాధనుకో . నీవు అరగంట పడుకో నేను కాపాలా కాస్తాను. లేకపోతే నేను పడుకుంటాను నీవు కాపలాకాయి. అంతేగాని వకేసారి ఇరువురం పడుకోవద్దు. ఇక్కడి వార్తలు వక్కరోజు అందించక పోయినా బాస్ ఊరుకోడు. మనల్ని. చావగొట్టి చెవులు మూసి పారేస్తాడు."
"చావగొట్టి చెవులు మూస్తే ఫరవాలేదు. నరేంద్రుని ఏం చేసాడో గుర్తుందా అది గుర్తుకు తెచ్చుకో చాలు.
"వేరే గుర్తుకు తెచ్చుకోవాటం ఎందుకు? ఇప్పుడు కూడా కళ్ళముందు కదులాడుతున్నది కదా! నాలుగడుగుల లోతు గొయ్యి తీసి ఆ గోతిలోకి నరేంద్రుని దించాడు. ఉప్పు, సున్నము, దురదగోండి అకురసము మిర్చి కలిపి వాడి చుట్టుతా పోసి గోయి నింపాడు. ఆ పై మట్టి కప్పాడు.
నరేంద్ర పీక కింద భాగం గోతిలో కప్పబడి వుంది. మెడపై భాగం నేల మీద మనిషి తలకాయ మొలచిందే అన్నట్టు వుంది. నరేంద్ర గోతి లోంచి బయటికి రాలేదు! విపరీతమైన దురద భాదనుభావిస్తూ ఊపిరి పీల్చుకోటానికి యమయాతన పడుతూ కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్ళు కారుతుంటే వెర్రిగా కేకలు వేసివేసి చివరికి స్పృహ తప్పి తల వాల్చేశాడు. అప్పటికీ ప్రాణం పోలేదు! ఆ జీవుడు మరణయాతన పడిపడి చివరికి ఎప్పటికో హరీ అన్నాడు! అది ప్రత్యేక్షంగా చూసిన మనం చస్తే తప్పు చేస్తామురా చెయ్యం." ఉమాపతన్నాడు.
"బాస్ వేసే శిక్షలు కొత్త రకంగా భయంకరంగా ఉంటాయి. మన బాస్ ముందు మయధర్మరాజు ఎందుకూ పనికిరాడు" అన్నాడు రాజయ్య.
"అసలు మన బాస్ యొక్క కదా కమామిషూ వేరనుకో. బాస్ దగ్గర మనం పనిచేస్తున్నందుకు గర్వించాలి. పరమేశ్వరీ ఆలయ రహస్యం అయన పట్టాడు అంటే అయన కృషి ఎంత చేశాడో ఆలోచించు. లక్షలు కాదురా బాబు కోటానుకోట్లు . బాస్ అది సాధించిన మరుక్షణం మనందరికీ తలొక లక్షా ఇస్తానన్నాడు కదా! ఈ పనికి మానని నియమించాడూ