పన్నీటి కెరటాలు 3
telugu stories kathalu sahithi పన్నీటి కెరటాలు 3 చచ్చినవాడి కళ్ళు చారడేసి అన్నట్లు అక్కడచేరి ఎలాగూచచ్చాడు కాబట్టి సానుభూతి మాటలు ఎవరికితోచిందివారు మాట్లాడటం మొదలు పెట్టారు.
ఊరు నిద్రలేచింది.
కిందకి పైకి తిరిగేవాడు కురై తికి వార్త అందించాడు. మనం యింకా యిక్కడ ఉండటం మంచిదికాదని.
అక్కడికి ధైర్యం చేసి మరొక్క పావుగంట పనికానిచ్చి ఉట్టిచేతులతో కురైవతి తనవాళ్ళని తీసుకుని నిరాశతో కొండిదిగిపోయాడు.
చచ్చినవాడు చచ్చాడు.
కురైవతి తనవాళ్ళతో వెళ్ళిపోయాడు.
తెల్లవారుజామునుంచీ వక్కోబిచ్చగాడూ లేవటం మొదలుపెట్టాడు.
పెద్దపూజారి చిన్నపూజారి గుడికి బైలుదేరారు.
మరోగంట తర్వాత
ఊరువాడ కోడైకూసింది.
ఈతఫా గుడిని మొత్తం తవ్వేశారు దొంగలు గుడిమొత్తాన్ని పెగలించుకుపోయారు అని.....
ఇదిగోతోక అదిగోపులి అందరికీ తెలిసినకధే అయినా ప్రజలధి ఆ కథ మర్చిపోయి తోక-పులి కథలు ప్రచారం చేస్తూనే వుంటారు.
గుడి ఏమీ చెక్కుచెదరలేదు.
గుడిచుట్టూ తానే దొంగలు రాళ్ళు పైకిలేపి తవ్విపోశారు కాని కధకిమాత్రం చిలవలు పలవలు చేర్చడం జరిగింది. గుడిని తవ్వనూలేదు ఎవరూ ఎత్తుకెళ్ళనూలేదు.
ఏదో చెడువాసన వస్తే తనుగట్టిగాపీల్చి ఆతర్వాత సృహతప్పానని శివుడు క్రితంసారి కట్టుకధ చెప్పాడు. ఈతఫా ఏవాసన పీల్చకుండానే ఏం జరుగుతుందో తలకి ఎక్కకముందే తనుకుప్పకూలిపోవడం జరిగిందని చెప్పాడు.
శివుడికికాని, పుట్టన్నకికాని మర్నాడు మధ్యాన్నందాకా తెలివిరాక