పన్నీటి కెరటాలు 5

By | August 23, 2022
telugu kathalu navalalu sahithi పన్నీటి కెరటాలు 5 "గోడమీద రాతలకి మరి అర్ధమేమిటో?" అని వ్యంగ్యంగా అడిగాడు ఆర్ష్. ఏ "గోడమీద రాతలు?" "ఏమీ ఎరగనట్లు మాట్లాడవద్దు సాధనా! ఇప్పటికే కురైపతి తెలివి తక్కువవల్ల ఇటు ప్రజల దృష్టిలోకి అటు ప్రభుత్వం దృష్టిలోకి దేవాలయంలో త్రవ్విన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు పరమేశ్వరీ ఆలయంలో భక్తులసంఖ్య పెరగటమేకాక వచ్చేపోయే జనసందోహమూ అధికారులదృష్టి వుత్త తెలివితేటలూ, చాకచక్యమూ చాలవు, మెరపువేగమూ, పిడుగుపాటులా ప్రవర్తించడమూ కావాలి. తస్మాత్త్ జాగ్రత్తోం జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తూ గుడిచుట్టూ త్రవ్వటమే కాదు. గుడిని త్రవ్వేస్తాము. గుడిలో విగ్రహాలు ఎత్తుకు పోతాము" అని గోడమీద హెచ్చరికలు రాస్తే ఇంక ఏమి సాధించగలవు? అసలు ఆ రాతలు రాయడంలో నీ వుద్దేశ్యమేమిటి?" కరకుగా అడిగాడు ఆర్ష. "చాలా తెలివిగా ఎంతో ముందు చూపుతో ఈ రాతలు నేనే రాశాను బాస్" ఏ మాత్రం జంకులేకుండా చెప్పింది సాధన. "నువ్వు......నువ్వు......రాశావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆర్ష. "మీరే అడిగారు కదా బాస్! ఈ రాతలు నువ్వెందుకు రాశావు అని. గుడి గోడమీద ఈ జాగ్రత్త అనే మాటను ఇంత వివరంగా నేనెందుకు రాశానో చెబితే మీరే చాలా ఆశ్చర్యపోతారు చాలా పెద్ద ప్లాన్ తో తిరిగులేని పధకం వేసి రాసిన రాతలు అని ఆ రాతలే చలనం సంచలనం తీసుకువచ్చాయి అలా తీసుకురావటంవల్ల కేవలం ఆ రాతలవల్ల నా మార్గం చాలా సులువు అయ్యింది" అంది సాధన. లంబా చాలా ఆశ్చర్యపొయ్యాడు. సాధన చెబుతున్నది వింటూంతే అతనికి అంతా అయోమయం ఐపోయింది. సాధన ప్లాన్ ని భగ్నం చెయ్యటానికి బాస్ దృష్టిలో సాధన ఫూల్ కావటానికీ ఈ కేసులో సాధన అపజయంపాలు కావటానికి గుడిలోపలి గోడమీద మారువేషంలో తను వెళ్ళి స్వయంగా తనేరాశాడు. ఇప్పుడు బాస్ అడుగుతూ వుంటే ఇప్పుడు సాధన

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.