పన్నీటి కెరటాలు 6

By | September 12, 2022
telugu stories kathalu novels పన్నీటి కెరటాలు 6 అసిరి 'అసిరిపల్లె రావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది నాయనా!' అప్పుడే లోపలికి వచ్చిన టి.సి.ని అడిగింది ఆమె. 'సరీగ గంట పడుతుంది' టి.సి. చెప్పి ముందుకు సాగాడు. 'ఇంకా గంట కూర్చోవాలన్నమాట!' స్వగతంగా అనుకుంది ఆమె. ఆమె ఎదుటి బెర్త్ మీద కూర్చుని 'కాలమా ఆగిపో' అన్న నవల చదువుతున్న యువతీ ఓ సారి తలెత్తి ఆమెవేపు చూసి మళ్ళీ నవలలోకి తల దూర్చుకుంది. ఆ కంపార్టుమెంటులో పదిమందిదాకా ఉన్నారు. ఎవరి గోల వాళ్ళది. అందరూ వెళుతున్నది మాత్రం అసిరిపల్లె. ఆ వూళ్ళో కొండమీదనున్న పరమేశ్వరీదేవి ఆలయ మహత్యాలు విని ఆయా వూళ్ళ నుంచి బయలుదేరి ఈ రైలు ఎక్కినవాళ్ళు వీళ్ళు. ఆమె వయసు యాభయ్ యాభై అయిదు లోపల వుంటుంది. కళకళలాడే ముఖం. పెద్దబొట్టు, సగం నెరిసీనెరవనట్లున్న, తలకట్టు బర్మా ముడి చుట్టుకుంది. సింపుల్ గా వున్న పట్టుచీర కట్టుకుని ఉత్తమ ఇల్లాలి తరహాగా పమిట నిండుగా కప్పుకుంది. వంటిమీద వున్న బంగారాన్ని బట్టి ధనవంతులే అనిపిస్తున్నది. కళ్ళజోడు వుంది. కళ్ళజోడును తీసి మాటిమాటికీ కళ్ళని తుడుచుకోటం జోడుని తుడవటం చేస్తున్నది. మధ్యమధ్య భారంగా ఓ నిట్టూర్పు వదులుతున్నది. ఆమె పక్కనే ఇరవయ్యి ఇరవైరెండు ఏళ్లుగల కుర్రాడు ఆమెను అతుక్కున్నంత దగ్గరగా కూర్చుని ఉన్నాడు. ఉన్నట్టుండి ఆ కుర్రాడు 'అమ్మే!' అన్నాడు. ఆవు అంబా అన్న తీరులో. 'ఏంటి నాన్నా!' అంది ఆమె. 'ఆపిచ్చి కావాలి కావాలి' అన్నాడు ముద్దుముద్దుగా. 'తీసిస్తానుండు' అంది ఆమె. ఆ మాట అంటూనే సీటు కిందగా పెట్టిన టిఫెన్ క్యారియరును, మరచెంబుని ఇవతలికి లాగింది. క్యారియరు మూత తెరిచి ఒక అరిశ ఒక సున్నుండ తీసి ఆ కుర్రాడి చేతిలో

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.