పన్నీటి కెరటాలు 8

By | September 22, 2022
telugu kathalu novels sahithi పన్నీటి కెరటాలు 8 అంత పెద్ద సీటులో కూర్చున్న మీరు యింకే విషయం గురించి ఆలోచిస్తారు సార్! కేసు గురించి తప్ప!' 'కరెక్ట్, నేను కేసు గురించే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. నాలుగయిదు రోజులు ఆ వెధవని వెంటాడాము, చేతికి చిక్కే సమయంలో ఉడాయించాడు." "అవును సార్! చిక్కీ చిక్కనట్లు చిక్కి, చటుక్కున మాయమయ్యాడు" అహోబిలం అన్నాడు. 'సరిగ్గా అదే జరిగింది అదే నా బాధ" 'బాధపడకండి సార్!' 'బాధపడకుండా ఎలా ఉంటాను బంగారం లాంటి (కెమెరా కాదూ!) కేసు అందినట్లే అంది అందనంత దూరం పోతే బాధగాక సంతోషం కలుగుతుందా!' 'నిఅజ్మే సార్!' 'గుడిలో త్రవ్వటము నా తప్పే. గుడిలో హత్యలు జరగటము నా తప్పే అంటారు నా మొగుళ్ళు. నేను నేను.... దొంగనాకొడుకులని పంపించి త్రవ్వమన్నానా! చంపమన్నానా. అక్కడికీ మన అదృష్టంకొద్దీ దొంగల ముఠాలోని ఓ వెధవ సన్యాసి మనకి కనపడి చచ్చాడు. వాడు గుడి గోడలని నేలని గోపురాన్ని ఎవరూ చూడకుండా పరిశోధిస్తుంటే మనం చూసి మనం అంటే నేనులే. చూసి పరిశోధిస్తే క్లూ అందిన సమయంలోనే వాడు ఉడాయించె, నేను చావనా!' 'వద్దు సార్! అది మీ తప్పు ఎంతమాత్రం కాదు. మనం వాడివెంట పడుతున్నామని గ్రహించాడు. పక్షిలా ఎగిరిపోయాడు. ఎప్పటికయినా వాడిని మీరు పడతారు చూడండి." 'మనం వాడి....వెంట....పడుతున్నామని....వాడు.... గ్రహించాడంటావ్ అంతేనా!' "అంతే సార్!" "ఎలా గ్రహించావ్?" 'చచ్చితిని ఈ పిచ్చిముండా వెధవతో ఒకమాట ఎక్కువ మాట్లాడినా తప్పే తక్కువ మాట్లాడినా తప్పే. వెధవ కేసు పోతే పోయింది. మారువేషాలు వేసుకుని తిరగటం వల్ల వూహించని విధంగా

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.