ప్రేమించండి ప్లీజ్ 10

By | October 30, 2022
telugu stories sahithi ప్రేమించండి ప్లీజ్ 10 ఈ హఠాత్పరిమాణానికి అతని మిత్రులంతా చిత్తరువుల్లా నిలబడిపోయారు మండలాధ్యక్షుడు రామ్మూర్తిని ఎందుకంత కసిగా కొట్టాడో వాళ్ళకు అర్ధం కాలేదు. బయట ఏదో జరుగుతూ వుందని అనిపించడంతో సుధాకర నాయుడు ఎమ్మెల్యే తదితరులు అంతా అక్కడికి వచ్చారు. "వీడు ఈ బాస్టర్ మనల్ని డిస్టర్బ్ చేస్తాడా!" మండలాధ్యక్షుడు వచ్చిన వాళ్ళతో అంటున్నాడు. జగదీష్ ఇక తట్టుకోలేక పోయాడు "మత్రిగారూ! అతను రామ్మూర్తి మీ ఫ్రండ్" అని అరిచాడు." దీంతో సుధాకరనాయుడు రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. తల లేపి చూసి "ఛీ ఛీ వీడు నా ఫ్రండ్ అంటారేమిటి? వీడ్ని ఎప్పుడూ చూడలేదు." మిత్రులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పటికి వాళ్ళకు ఏదో కొంత అర్ధమవుతూ వుంది. సుధాకరనాయుడు కూడా తెలియదనడంతో మండధ్యక్షుడు మరింత రెచ్చిపోయాడు. పిచ్చి పట్టినవాడిలాగా వూగిపోతూ మరో రెండు దెబ్బలు కొట్టాడు రామూర్తిని. చివరి సారన్నట్టు శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని గట్టిగా తన్నాడు. రామ్మూర్తి కింద పడిపోయాడు. అవమానంతో అతని ముఖం ముడుచుకుపోయింది. కళ్ళు వర్షిస్తున్నాయి. నాలుక పిడచకట్టుకుపోయింది. పెదవులంతా దుమ్మును పీల్చుకొని బండబారాయి. మండలాద్యక్షుడు ఆయాసాన్నంతా దిగమింగుకొని "వీడ్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపొండి! వీడెవడో మిమ్మల్ని మోసంచేసినట్టున్నాడు పార్టీ కార్యకర్త కాకపోయినా పార్టీలోని పెద్ద మనుషులంతా తెలుసుకొని తాము అడిగితే కాదనకుండా పనులు చేస్తారని చెప్పుకొంటూ జేబులు ఆపుకొంటూ వుంటారు. ఇలాంటి వాళ్ళు అబద్దాలు చెప్పుకొంటూ బతికేస్తుంటారు. వీడ్ని నాకుగానీ, ఎమ్మెల్యేకి గానీ, మంత్రికిగానీ తెలీదు..వీడ్ని పార్టీ మీటింగ్ ల లో గానీ, బహిరంగసభల్లో గానీ చూడలేదు కాబట్టి ఇక నుంచి వీడు మమ్మల్ని తెలుసుంటే చెప్పు తీసుకొని కొట్టండి. డబ్బులడిగితే పోలీసులకి పట్టివ్వండి సరేనా" అని జగదీష్ ను చూసి "రండి వీడ్ని తీసుకుపొండి" అని పిలిచాడు. మిత్రులంతా దిగులుగా లోపలికి వచ్చారు. తప్పంతా రామ్మూర్తి దేననిపిస్తోంది. తనకి తెలియకపోయినా తెలిసినట్టు చెప్పడం తప్పే ననిపించింది. అందుకే వాళ్ళు మౌనంగా మిత్రుడ్ని లేపారు. రామ్మూర్తి వాళ్ళ

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.