ప్రేమించండి ప్లీజ్ 12
telugu stories kathalu sahithi ప్రేమించండి ప్లీజ్ 12 "అలా బతుకుతున్నామని ఎప్పుడైనా బాధ కలగదా?" చాలా సేపయ్యాక అడిగాడు అతను.
"బాధ పడతాడు. ఎంతగా అంటే- ఆ బాధ కూడా అలవాటైపోయి విసుగొచ్చేదాకా. అందుకే బాధపడడాన్ని ప్రేమిస్తున్నాను. నాకెవరూ లేరన్న బాధను ఇష్టపడడం నేర్చుకున్నాను. నేను బతికి వున్నానన్న విషయం ఆ బాదే గుర్తుచేస్తుంది."
అంటే ఇది ఓ రకంగా సుఖాలమీద కసి తీర్చుకోవడం. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్" అని ఓ కవికూడా ఇదే కసితో అనుంటాడు. లేకపోతే బాధ ఎప్పటికి సుఖం కాదు. అలాంటిది బాధనే సుఖమనుకోవడం ఆసుఖం పట్ల మన కసిని ఎగ్జిబిట్ చేయడం ఇది ఓ రకమైన విరక్తి. దానీ బుజ్జి అలవరుచుకుంది.
"నిన్ను ప్రేమిస్తాడా?" తక్కువ అడిగాడు అతను.
బుజ్జి ఓ క్షణంపాటు అతని ముఖంలోకి చూసి 'ప్రేమించలేను. ఇలా నిష్కర్షగా అన్నందుకు ఏమీ అనుకోను. మనిషి మీద ముఖ్యంగా మగవాడి మీద నమ్మకం పోయిన నాలాంటిది ప్రేమించదు. నీ వల్ల ఏదైనా లాభం వుంటే ప్రేమించినట్టు నటిస్తాను. అంత తప్ప నేను నిన్ను నిజంగా ప్రేమించలేను. ఈ కారణం చేతే చాలామంది భార్యలు కూడా భర్తల్ని ప్రేమించలేరు. బజార్లో తనకు అప్పు దొరకలేదని ఇంటికొచ్చి భార్యమీద ఆ కసినంతా తీర్చుకునే భర్తమీద భార్యకు ప్రేమ వుంటుందా? వుండదు. కానీ వున్నట్టు నటిస్తుంది. ఎందువల్ల? అంత కంటే గత్యంతరం లేదు కాబట్టి. ఆ తప్పంతా భర్తదే. కానీ అది వాడు తెలుసుకోడు. పురుష దురహంకారం తెలుసుకోనివ్వదు' అని ఆగింది.
తల తిరుగుతోంది. అతనికి మనిషికి అవసరమైన ప్రేమ పొందడం వెనుక అంత కథ వుందా? మరి ఇలాంటప్పుడు ప్రేమ పునాది మీదే మనుష్యుల సంబంధాలు ఆధారపడి వుండడం జరుగుతుందా?
'అందుకే ప్రేమ జోలికి వెళ్ళకుండా సుఖపడడం నేర్చుకో -- మనుషుల మందలో కలిసిపోయి బతకడమే ఉత్తమమైన మార్గం"
"ఇక్కడే తను మిగిలిన వాళ్ళతో వేరు పడిపోతున్నట్టనిపించింది. ఆంజనేయులకు మహాలింగం- బుజ్జి- వీళ్ళకంతా ప్రతి విషయం మీద చివరికి ప్రేమ మీద కూడా ఓ అవగాహన వుంది. కానీ తనకు లేదు. అందుకే తను ఎక్కడికో లక్ష్యం లేకుండా కొట్టుకుపోతున్నాడు.
"ఇప్పుడెందుకు ఆ గొడవంతా ఇలా దగ్గరకు రా" వాతావరణాన్ని తేలికపరచడానికి అంది.
అతను ఆమె ముందుకు మరింత జరగాలని ప్రయత్నించాడు కానీ ఒళ్ళంతా బిగుసుకుపోయినట్టు కదలలేకపోయాడు.
"బట్టలు విప్పుకో"
"అతనిలో చలనం లేకపోయేసరికి మీదకు