ప్రేమించండి ప్లీజ్ 13

By | November 20, 2022
telugu stories sahithi ప్రేమించండి ప్లీజ్ 13 ఆంజనేయులు ముందున్న బ్యాచ్ లో చిరంజీవి అసోసియేషన్లు ఆంద్రదేశంలో ఎన్ని వున్నాయో, అవి చేస్తున్న పనులేమిటో అన్న టాపిక్ మీద ఘాటుగా చర్చించుకుంటున్నాయి. మరో పది నిమిషాలకు కలకలం సద్దుమణిగినట్టు నిశ్శబ్దం పేరుకుంది. ఏమైందోనన్న కంగారులో ఆంజనేయులు అందరూ చూస్తున్న వంక చూశాడు. ముగ్గురు వ్యక్తులు థియేటర్ ముందు భాగానవున్న సన్ సైడ్ మీదకు ఎక్కుతున్నారు. కింద మరో ముగ్గురున్నారు. "వాళ్ళు ఏం చేస్తున్నారక్కడ?" ఆంజనేయులు మెల్లగా ప్రశ్నించాడు తన ముందు నిలుచున్న కుర్రాడిని. అమెరికాను కనిపెట్టింది. ఎవరో చెప్పలేని స్టూడెంట్ ను హిస్టరీ టీచర్ చూసినట్టు చూశాడు ఆకుర్రాడు. "చిరంజీవి కటౌట్ ను తగిలిస్తున్నారు" ఆంజనేయులు అజ్ఞానాన్ని మొదటిసారి కాబట్టి మన్నిస్తున్నట్టు జవాబు చెప్పాడు. అప్పటికే తాను కటౌట్ ను ఏర్పాటు చేసే సుందర దృశ్యాన్ని మిస్ అయినట్టు వెంటనే తల తిప్పుకున్నాడు. ఆంజనేయులు కూడా అటే చూపు సారించాడు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. తదేకంగా అటే చూస్తున్నారు. భక్తులు ధ్వజస్తంభాన్ని కూడా అంతతదేకంగా చూడరు. కిందనున్న ముగ్గురు వ్యక్తులు లోపల్నుంచి ఓ అట్ట తెచ్చారు. అది కటౌట్ లో ఒక భాగమని అర్ధమైంది ఆంజనేయులుకు. దాన్ని కిందనున్న వాళ్ళు అందిస్తే సన్ షేడ్ మీదున్న వాళ్ళు అందుకున్నారు. అది ఏ భాగమో చూసి అక్కడ నిలబెట్టారు. కటౌట్ ను కట్టడానికి అంతకుముందే వెదురులతో సపోర్ట్ కట్టివున్నారు. ఇప్పుడు కటౌట్ లోని ఆ భాగం జనానికి కనిపిస్తోంది. "రేయ్! అదిగోరా గురువుగారి కాలు" గుంపులోని ఎవరో గట్టిగా అరిచారు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అందరి కళ్ళలోనూ ఆనందభాష్పాలు ఆ ఉదయంపూట ముత్యాల్లా వున్నాయి. సాక్షాత్తూ చిరంజీవిని చూసినట్టు అక్కడున్న కుర్రకారంతా కటౌట్ లోని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.