ప్రేమించండి ప్లీజ్ 14
telugu stories sahithi ప్రేమించండి ప్లీజ్ 14 ఈ ఉదంతాన్ని వినయ్ వివరిస్తూ 'ఆ దంపతుల గురించి వింటూనే వాళ్ళకు పిల్లలుండరనీ అనిపించింది. పిల్లలు కలగకపోవటం మన సంఘంలో చాలా న్యూనత కింద చూస్తారు. దీన్నుంచి తప్పించుకోవడానికి పిల్లలు లేనివాళ్ళు చాలా తంటాలు పడుతుంతారు. అందులో భాగమే ఆ భార్యభర్తల ప్రవర్తన, తమ మధ్య ఎలాంటి కలతలులేవనీ, తమ మధ్య ఎడతెరపి లేకుండా శృంగారం జరుగుతూ వుందనీ, అయితే దేవుడి దయ లేకపోవడంవల్లే పిల్లలు పుట్టలేదని నలుగురికి తెలియజెప్పడానికే వాళ్ళు అలా ప్రవర్తించేవాళ్ళు అంటే తాము సెంట్ పర్సంట్ స్త్రీ పురుషులమేనని చెప్పే సర్టిఫికేట్ చూపించడం లాంటిదన్నమాట" అని చెప్పాడు.
వినయ్ ఎనాలిసిస్ కరెక్ట్ తాను ఏ చెడుతిరుగుళ్ళూ తిరగడంలేదని చెప్పడానికే ఇంద్రాణి చెడ్డతనాన్నే ఎక్స్ పోజ్ చేస్తుంది. ఇలాంటి టెక్నిక్కులు తెలియని ప్రభావతి లాంటి వాళ్ళు మానసిక రుగ్మతలకు లోనవుతాయి. ఇంత క్రితం ఇంద్రాణి మంజుల గురించి చెప్పిందంతా మెదిలింది ఆంజనేయులకు.
ఆ మధ్యాహ్నం అంతా చాలా ఆలస్యంగా భోజనాలు ముగించారు. ప్రభావతికి బాగా కుదుటపడింది. తిరిగి మామూలు మనిషైంది.
ఆంజనేయులు భోజనం ముగించి నడుం వాల్చాడు మగతగా నిద్ర కమ్మింది.
సాయంకాలం నాలుగు గంటలకు మెలకువ వచ్చింది. లేచి ముఖం కడుక్కుని బయటపడ్డాడు.
అలా నడుచుకుంటూ బస్టాండ్ కు చేరుకొని, అక్కడున్న సిమెంట్ బెంచీమీద కూర్చున్నాడు.
టౌన్ కెళ్ళేవాళ్ళూ, టౌన్ నుంచి వస్తున్న వాళ్ళతో బస్టాండ్ అంతా రద్దీగా వుంది.
అలా మనుషులను గమనిస్తున్న అతనికి ఓ విషయం బోధ పడింది. చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరు పరాయిగా బిహేవ్ చేయడం కనపడింది.
ఇక దానిమీద ఆలోచన సాగింది.
భార్యభర్తలు ఎందుకంత పరాయిగా వుంటారు? భర్తముందు నడుస్తుంటే భార్య ఎక్కడో దూరంగా ఒదిగొదిగి వస్తుంటుంది. బస్సులోనూ అంతే భర్త ఓ పక్కకి చూస్తుంటే, భార్య మరో వంక చూస్తుంటుంది. పక్కపక్కనే కూర్చుని వున్నా ఇద్దరి మధ్యా కొన్ని యోజనాల దూరముంటుంది.
ఇదే విషయం మీద ఓ సందర్భంలో వినయ్ చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి ఆంజనేయులకు.
'భార్యా భర్తల మధ్య అంత అగాధం వుండటానికి కారణం ఒకరికొకరు పాతబడిపోవటం, అలవాటైపోవడం, పెళ్ళయిన కొత్తల్లో ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ వుంటుంది. రోజులు గడిచేకొద్ది అది లిక్విరేట్ అయిపోతుంది. సంవత్సరాల కొద్దీ ఇద్దరూ