ప్రేమించండి ప్లీజ్ 2

By | August 8, 2022
telugu kathalu navalalu ప్రేమించండి ప్లీజ్ 2 తన పేరేమిటని ఎవరైనా అడిగినప్పుడు తను చాలా ఇబ్బంది పడిపోతాడు. ఈ ఇబ్బందివల్లే వెంటనే నోరు పెగలదు. ఇక తప్పదని అక్షరాలను కూడబలుక్కుని చెబుతాడు. ఎదుటివాళ్ళు తన పేరు వినగానే కళ్ళ నొసలను చిట్లించడం ఎన్నోసార్లు గమనించాడు. "వినయ్ అని నాకు ఎవరు పేరు పెట్టారో తెలుసా? మా ఆంటీ ఆవిడకి ఎంత ముందు చూపుంటే పాతిక సంవత్సరాల క్రితం ఈపేరు పెడుతుంది. ఎన్ని సంవత్సరాలయినా చాలా ఆకర్షణీయంగా వుండే పేరు పెట్టడం ఒక ఆర్టు." "వినయ్ తన పేరును గురించి ఎంతో సంబరంతో చెబుతుంటాడు." ఆంజనేయులని తనకు ఈ పేరు ఎవరు పెట్టారు? నాన్న పెట్టాడా? పురోహితుడు పెట్టాడా? అమ్మ మాత్రం కాదు. తను పుడుతూనే అమ్మ చచ్చిపోయింది. తన ప్రతిబింబాన్ని ఈ లోకంలో వదలి అమ్మ మరో లోకానికి వెళ్ళిపోయింది. ఎలా వుండేదో అమ్మ? అమ్మగుర్తొచ్చేసరికి అతనికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "ఒక్క బస్సూ రావడంలేదు." సంధ్య విసుక్కుంది. వచ్చేస్తుంది బస్సు రాగానే వెళ్ళిపోదాం." కళ్ళనీళ్ళు కనపడకుండా తుడుచుకుంటూ చెప్పాడు ఆంజనేయులు. మళ్ళీ అతను తన ప్రపంచంలోకి. అమ్మ చచ్చిపోతే తను పిన్ని చేతుల్లో పెరిగాడు. అయితే ఆ చేతుల్లో అభిమానపు వెచ్చదనం లేదు. అనురాగపు చల్లదనం లేదు. నాన్న ఎప్పుడూ దగ్గరికి చేర్చేవాడు కాడు. జీవితంలో తగిలిన దెబ్బలను నిమురుకోడంలోనే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.