ప్రేమించండి ప్లీజ్ 3

By | August 11, 2022
telugu stories sahithi ప్రేమించండి ప్లీజ్ 3 మంజుల ఆలోచనల్ని తెంచేసి "సినిమాకొచ్చాను వినయ్ గారూ" అని చెప్పగలిగాడు ఆంజనేయులు. "నేనూ సినిమాకే రండి కాఫీ తాగుదాం" వినయ్ ముందుకు తిరిగి స్నాక్ బార్ వైపు నడిచాడు. ఆంజనేయులు అనుసరించాడు. "ఒక్కరే నచ్చారా?" అతను అడిగాడు. వినయ్ లాంటివాడు ఒక్కడే సినిమాకు రాడు. కానీ ఆ విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాస తనచేత ఆ ప్రశ్న అడిగించింది. వినయ్ జవాబు వింటే తప్ప తన మనసు ప్రశాంతంగా వుండదు. "లేదండీ, ఓ స్నేహితురాలు సినిమా చూద్దామంటే వచ్చాను. ఆమె కోసమే వెయిటింగ్. జెవెఇథమ్లొ అత్యంత మాధుర్యమైనదీ, అంతకంటే బాధాకరమైనదీ నిరీక్షణే. ఈ నిరీక్షణలోనే జీవితాలు తెల్లవారిపోతాయి. ఏమంటారు?" కళ్ళను ఎగరేశాడు వినయ్. అవును నిరీక్షణలోనే బతుకులు వెలవెలబోతాయి. అయితే నిరీక్షించడానికి కొందరికి మనుషులైనా వున్నారు. తనలాంటివాళ్ళకు ఆ అవసరమే రాదు కారణం వచ్చేవాళ్ళు ఎవరూ వుండరు గనుక. బాగా వాడిపోయిన పువ్వులాంటి నవ్వు ఆంజనేయులు పెదవులమీద రాలింది. "ఆడపిల్ల కోసం వెయిట్ చేయడమంటే చాలా కష్టం. ఓ పట్టానరారు. కారణాలు అనేకం అనుకోండి. బహుశా ఈమె మేకప్ ఇప్పటికీ పూర్తయి వుండదు. ఆడపిల్ల ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తుందో తెలుసా ఆంజనేయులు గారూ- తననే. దీనినే నార్సిసిజం అంటారు. అమ్మాయిలంతా స్వప్రేమికులు దీనికీ కారణం సమాజమే. ప్రతి ప్రేమకూ ఇద్దరుండాలి. ఆ ప్రేమను సరిసమానంగా పంచుకోవాలి. పురుషాధిక్యత ఛలామణిలో వున్న ఈ సంఘంలో ఆడపిల్ల ఎప్పుడూ మగవాడ్ని సరిసమానంగా చూడదు. తమ ఆబ్జెక్ట్ అనీ, తాను పురుషుడికోసమే వున్నానన్న ఫీలింగ్ ప్రతి చిన్న సంఘటనగా రుజువు చేస్తుంటుంది. దీనికి ఓ ఉదాహరణ చెబుతాను" వినయ్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.