ప్రేమించండి ప్లీజ్ 4

By | August 15, 2022
telugu stories kathalu sahithi ప్రేమించండి ప్లీజ్ 4 ఇలా ఆంజనేయులు తనలో తాను సూత్రీకరణలు, నిర్వచనాలు చెప్పుకుంటూ వుండగా ఓ చిన్నపిల్ల అక్కడకు వచ్చింది. ఆంజనేయులు కూడా ఆ పిల్లవైపు చూసాడు. ఆపాప నేరుగా జగదీష్ దగ్గరకు వెళ్ళి తన చేతిలోని ప్యాకెట్ ఇస్తూ "సీతక్క నీకిమ్మంది. లోపల లెటర్ కూడా వుందంట" అని అక్కడి నుంచి తుర్రుమంది. ఆప్యాకెట్ ఏమిటోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జగదీష్ దానిని విప్పి "స్వీట్స్ లా వున్నాయి. స్త్రీలు వంటింటి మహారాణులు కనుక పిండి వంటలు పంపడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఏ ఆడపిల్లయినా నీకు స్పెషల్ గా పిండివంటలు పంపిందంటే ఆ పిల్లకు నువ్వంటే చాలా ఇష్టమని గుడ్డిగా నమ్మచ్చు." అన్నాడు. మిగిలిన అబ్బాయిలంతా కరెక్టేనని తమను ఇష్టపడే అమ్మాయిలు ఎప్పుడెప్పుడు ఏం పంపారో ఏకరువు పెడుతున్నారు. తనకూ చెప్పుకోవడానికి ఏమైనా వుందా అని ఆలోచించాడు ఆంజనేయులు. వూహూఁ ఏదీ తగల్లేదు. ఏ ఆడపిల్లా తనకింతవరకు తినుబండారాలు పంపలేదు. ముఫ్ఫై ఏళ్ళు దాటిపోతున్నా ఇలాంటి అనుభవం లేకపోవడం బాధాకారం. ఈ బాధను పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఎంత దౌర్భాగ్యం! ఇక అక్కడ వుండలేకపోయాడు ఆంజనేయులు. లేచి వచ్చేశాడు. ఇంటికెళ్ళ బుద్దికాలేదు. నేరుగా నరసింహులు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా రష్ గా వుంది. ఓ మూల నిలబడ్డ ఇతన్ని చూస్తూనే నరసింహులు "ఏమయ్యా!

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.