ప్రేమించండి ప్లీజ్ 5

By | August 23, 2022
telugu kathalu navalalu sahithi ప్రేమించండి ప్లీజ్ 5 ఆంజనేయులు మొత్తం విని షాక్ తిన్నాడు. మనిషి ప్రవర్తన మీద అతని కోర్కెల ప్రభావం ఎంతుంటుందో తెలిసింది. "కలలన్నీ కూడా ఇంతే. ఎక్కడో మన మనసు లోపలి పొరల్లో నిక్షిప్తమైన కోర్కెల ప్రతిరూపమన్న మాట కలలు. మరో తమాషా విషయం చెప్పనా. ఆడపిల్ల కలల్లో ఎప్పుడూ ప్రియుడు తప్ప మరో పురుషుడు రాడు. కానీ మగపిల్లల విషయంలో దీనికి పూర్తి డిఫరెంట్. ప్రేయసి తప్ప మిగిలిన అమ్మాయిలంతా వస్తారు. వాళ్ళతో సంభోగించినట్టు, ముద్దులాడినట్టు కలలుగంటారు. ఆంజనేయులుకు ఇప్పుడు అదంతా గుర్తొచ్చింది. వినయ్ చెప్పిన వన్నీ నిజాలే. తన చెల్లెలుకు ముందు పెళ్ళి కావాలి. ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా ఇంకా పురుష స్పర్శ ఎరుగదు. నాలుగురోజులు భోజనం తినకుంటే మనిషి స్వాధీనంలో వుండగలదా? అలానే ఇదీ. కానీ ఇది తను ఒప్పుకోడు ఒప్పుకుంటే వెంటనే చెల్లెలకు పెళ్ళి చేయాలి ఎలా చేస్తాడు తను? పూట గడవడమే కష్టమైన తాను పెళ్ళి చేయగలడా? ఇంపాజిబుల్. అందుకే తనకు ప్రభావతి జబ్బేమిటో తెలిసినా తెలియనట్టు నటిస్తాడు ఇంట్లోవాళ్ళు మోహినీ పిశాచంటే తల వూపుతాడు. భూతలింగం మంత్రాలు చదువుతుంటే మౌనంగా పరీక్షిస్తాడు తన అశక్తతను దాచుకోవడానికి తానూ దెయ్యంమీద నెపం నెట్టేస్తున్నాడు. గెనం మీదనుంచి పాదం జారటంతో పడబోయి నిలదొక్కుకున్నాడు. ఆలోచనలు చెదిరాయి. దూరంగా భూతలింగం వూరు కనిపిస్తోంది. చీకటి ముగ్గుమీద పెట్టిన వేపపూతలాగా దీపాలు. ఇప్పుడెళ్ళి భూతలింగాన్ని లేపాలి. అతను తనను చూస్తూనే 'మళ్ళీ దెయ్యం వచ్చిందా?' అని అడుగుతాడు. అది అబద్దమని ఇద్దరికీ తెలుసు. అతను కడుపు నింపుకోవడానికి అబద్దమాడుతాడు. తను కడుపు కొత్త భరించలేక అబద్దం చెబుతాడు. నిజానికి ఇద్దరిదీ కడుపుకు సంబంధించినదే. ఆంజనేయులు వూరు సమీపించాడు. మనిషి అలికిడి అప్పుడే కనిపెట్టినట్టున్నాయి. రెండు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.