ప్రేమించండి ప్లీజ్ 6

By | September 12, 2022
telugu stories kathalu ప్రేమించండి ప్లీజ్ 6 అప్పటికి ఆంజనేయులు తేరుకున్నాడు. మొత్తం విషయమంతా అర్ధమైంది అతనొక్కడికే అంతమందిలో. "సారీ సార్! తప్పయిపోయింది. మావాడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను" అని అతనికి అడ్డంపడ్డాడు. "ఏమిటి వీడికింత ఆత్రం. పెరుగు గిన్నెను తీసుకోవడానికి గంటలు గంటలా. పెరుగు కొంచెం తక్కువుంటే ఏమైపోతుంది? ఇలాంటి దరిద్రులకి హాస్టల్ సీట్లు ఇవ్వడమే తప్పు. ఆ గవర్నమెంటోడు ఇ.బి.సి. స్కాలర్ షిప్పులు ఇవ్వడంవల్లే ఇలాంటి వాళ్ళంతా చొరబడ్డారు. ఛీఛీ" ఆ విద్యార్ధి ఆమాటలన్నాక కాస్తంత శాంతించాడు. అప్పటికి అర్ధమైంది శెట్టికి తను చేసిన తప్పు మనిషంతా కదిలిపోయాడు. తనకు క్షమించమన్నట్లు ఆ విద్యార్ధి చేతులు పట్టుకున్నాడు. "నన్ను మన్నించండి. మీకు ఇబ్బంది కల్పించాను. మీరు చెప్పినట్లు నేను దరిద్రుడ్నే. మా నాన్న గాజులు వూరారా తిరిగి అమ్ముకుంటాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను అసలు గడ్డపెరుగుతో అన్నం తినడం ఫస్ట్ టైమ్ హాస్టల్ లోనే అంటే మీరు నమ్ముతారా. పాలు కొనడం అనేది మా ఇంట్లో ఇప్పటివరకు జరగలేదు. మజ్జిగ నేది మాయింట్లో ఎరగం. ఎప్పుడైనా పండుగలకో, పబ్బాలకో పావలా ఇచ్చి మజ్జిగ పోసుకొచ్చేది మా అమ్మ. ఆ చారెడు మజ్జిగ కోసం ఇంటిల్లి పాదీ కొట్లాడుకునే వాళ్ళం. నిజం సార్. అందువల్లే ఎక్కువ పెరుగున్న గిన్నె కోసం ఇలా గంటల తరబడి పరిశీలించడం సార్. అర్ధం చేసుకుంటారు కదా......" ఆ తరువాత వినిపించలేదు ఆంజనేయులుకు. తనకంటే హీనంగా వున్న శెట్టి ఇంటి పరిస్థితుల్ని తలుచుకుని ఏడుపొచ్చింది. మిత్రుడ్ని పొదివి పట్టుకుని హాస్టల్ కు తీసుకొచ్చాడు. తనలాంటి వాళ్ళే చాలామంది వున్నారని తెలియటంతో అతనికో విధమైన తృప్తి కలిగింది. చాలా రోజుల తరువాత తన పరిస్థితులను తలుచుకుని కుమిలిపోకుండా ఆంజనేయులూ మరిచిపోయాడు. ఆ రోజు సాయంకాలం మామూలుగానే బజారుకు బయల్దేరాడు. రోడ్డుకు అటువైపు వెళుతున్న మునిరత్నం వాళ్ళను చూసి

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.