ప్రేమించండి ప్లీజ్ 9

By | October 22, 2022
telugu stories kathalu sahithi ప్రేమించండి ప్లీజ్ 9 "చాలా చిన్న పని. నీలాంటివారు చిటికెలో చేయొచ్చు. మన యూత్ క్లబ్ కు స్థలం కావాలి క్లబ్ కోసం ఓ బిల్డింగ్ కట్టారనుకుంటున్నాం. ఈ వి.ఎల్. డబ్ల్యు క్వార్టర్స్ పక్కనే ఎకరా పోరుంబోకు స్థలం వుంది దాన్ని క్లబ్ కు ఇప్పించాలి." రామ్మూర్తి జగదీష్ చెప్పిందంతా సావధానంగా విని "ఇంతేనా ఓ నిమిషంలో చేస్తాను. ఎమ్.ఆర్. ఓకు చెబితే సరిపోతుంది. వెంటనే పట్టాలిప్పిస్తాడు" అన్నాడు. "అది సరిపోదు. మేం ఇంతకముందే ఎమ్ ఆర్ ఓను సంప్రదించాం. ఆయన కుదరదన్నాడు. కొత్తగా పట్టాలిచ్చేందుకు బ్యాన్ వుందన్నాడు. మరీ స్పెషల్ కేసులైతే తప్ప పట్టాలివ్వటం లేదన్నాడు. చివరగా ఆయనే ఓ ఉపాయం చెప్పాడు. కలెక్టర్ కి చెబితే- ఆయన ఆర్డర్ వేస్తే వెంటనే పట్టా ఇచ్చేస్తానన్నాడు" మనోహర్ వివరించాడు. కలెక్టర్ తో మాట్లాడాలా? అయితే చిత్తూరుకి వెళ్ళాలన్నమాట. కానీ నాకు కలెక్టర్ తెలీదు." "ఆ విషయం మాకూ తెలుసు- మాజీ మంత్రి సుధాకరనాయుడికి కలెక్టర్ చాలా దోస్తీ అట. నాయుడు ఒక్కమాట చెబితే పని అయిపోతుంది. అందువల్ల నువ్వు మన క్లబ్ తరపున ఓ వినతి పత్రం సుధాకరనాయుడి కివ్వాలి. స్ట్రాంగ్ గా కలెక్టర్ కి చెప్పమనాలి." "అలానే చెబుతాను. ఏదీ అరిక్విజిషన్ లెటర్?" "తయారుచేశాం. ఇదిగో" జగదీష్ ఓకవర్ అందించాడు. రామ్మూర్తి అందులోని కాగితాలను బయటకు తీశాడు. అన్నింటినీ పరిశీలిస్తున్నాడు. "ఓకే. ఈ రోజే నేను సుధాకరనాయుడితో మాట్లాడతాను." "మేమూ నీతోపాటు వస్తాం. మనక్లబ్ తరపున అందరూ వచ్చి వినతిపత్రం ఇచ్చినట్టు వుంటుంది." రామ్మూర్తి గతుక్కుమన్నాడు. "ఇంత మంది ఎందుకు? మొదట నేను వెళ్ళి మాట్లాడుతాను. "కంగారును బలవంతంగా అణుచుకుంటూ చెప్పాడు. "మేం వస్తే మాత్రం ఏం?" మనోహర్ అడిగాడు. దానికి రామ్మూర్తి జవాబు చెప్పలేకపోయాడు. "ఏం లేదనుకో...." నీళ్ళు నమిలాడు అతను. "అందులో ఈ రోజు మీ పార్టీ పెద్దలంతా గొల్లపాలెం వస్తున్నారు. ఆ వూర్లోని వెంకట్రామయ్య రైస్ మిల్లు ఓపెన్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన సుధాకరనాయుడికి, భక్తవత్సలానికి, ఎం.ఎల్. ఏకి డిన్నర్ ఇస్తున్నాడు. సాయంకాలం వాళ్ళంతా గొల్లపాలెం వస్తున్నారు. వెంకట్రామయ్య రైస్ మిల్లులో డిన్నర్. నిన్నూ పిలిచారా?" వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రామ్మూర్తి. నిజానికి ఆ డిన్నర్ గురించి అతనికి తెలీదు. కానీ తమ పక్కవూరికి వాళ్ళు వస్తున్న విషయం తనకు తెలియదంటే నామోషీగా వుంటుంది. అందుకే వెంటనే సమాధానం చెప్పడానికి తటపటాయించాడు. "నన్నూ పిలిచారు. ప్రయివేటు పార్టీ కదా వెళదామా వద్దా అనుకుంటున్నాను" "వెళదాం" ఎలానూ నిన్ను పిలిచారు. కాబట్టి ప్రాబ్లమ్

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.