శుభోదయం 10

By | October 30, 2022
telugu stories sahithi శుభోదయం 10 రాజారాం చిన్నగా నవ్వాడు. "భర్తస్థానం యివ్వనన్నాక ఆడదానికి ఆ మగాడు సోదరుడే అవుతాడు. మా మధ్య బంధుత్వంలేదు స్నేహం వుంది. మమత వుంది. సౌహార్దం..... రాధ నాకు యిప్పుడు తోడబుట్టినదానితో సమానం. ఏ మంచి చెడ్డయినా నన్నడగకుండా చెయ్యదు రాధ" రాజారాం గర్వంగా అన్నాడు. "మరయితే... నాకోసం మిమ్మల్ని ఎందుకు కాదనడం అంకుల్..." "శ్యాం! మీ అమ్మ దగాపడిన ఆడది. లట్టుకున్న భర్త ప్రేమించి పెళ్ళిచేసుకున్న రెండేళ్ళ అనుబంధాన్ని తృణప్రాయంగా తెంచుకోగలిగినప్పుడు, యింకో మగాడు మాత్రం శీలంకోల్పోయిన స్త్రీని పెళ్ళాడి ఆదరించి ప్రేమించగలడా అని అనుమానం. ఏ మగాడు కాని, ఆడదికాని తమ రక్తం పంచుకుని పుట్టని బిడ్డని తన బిడ్డగా స్వీకరించి ప్రేమించలేడని దానివల్ల కట్టుకున్నవాడికి, తనకు సుఖం వుండదని, తనబిడ్డ మధ్య నలుగుతాడని, తనకింక వివాహేచ్చలేదని నన్ను తిరస్కరించింది. అప్పటినించి నీవే లోకంగా, నీతోడిదే ప్రపంచంగా వంటరిగా బతుకుతూంది." "నాకోసం తన సుఖాలన్నిటిని బలిపెట్టి యింత త్యాగం చేసిందన్నమాట" చమర్చిన కళ్ళతో అన్నాడు శ్యాం. "త్యాగం అని ఆమె అనుకోలేదు. బాద్యత అనుకుంది. అసలామెకి మాధవ్ ప్రవర్తనతో పురుషులపట్ల అదోరకం విముఖత కలిగింది. ఆమె ప్రేమని, నమ్మకాన్ని మాధవ్ దెబ్బతీసాక ఆమెలో అదోరకం విరక్తి, నిర్లిప్తత బయలుదేరాయి." "అంకుల్, అమ్మకి మీకూ ఎలా పరిచయం?" కుతూహలంగా అడిగాడు శ్యాం. "మీ అమ్మ యీ కాలేజీలో పనిచేసేముందు ఆరునెలలు మా కాలేజీలో పనిచేసింది. అప్పుడే మా పరిచయం. ఎంతో దిగులుగా, ఈ ప్రపంచ భారాన్నంతా మోస్తున్నట్లు క్రుంగిపోతూ, బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఎవరితో మాట్లాడకుండా కూర్చునే రాదని చూసి నాకెందుకో తెలియని కుతూహలం కలిగింది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఆమె వివరాలు కూపీలాగాను. వివాహితురాలని, బిడ్డతల్లని తెలిశాక నీళ్ళుగారిపోయాను. అయినా ఆమెపట్ల మానం చావలేదు. కావాలని పలకరిస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాను. ఓసారి నీకు మూడేళ్ళప్పుడు చాలా జబ్బు చేసింది. ఆ వంటరితనంలో తోచక బెంబేలుపడిన రాధ నా సహాయం కోరింది. అప్పటినించి యిద్దరం హితులమయ్యాం. ఆ స్నేహం పెపొందాక పెళ్ళిచేసుకుందామా అంటే వప్పుకోలేదు. ఎంతగానో అడిగితే అప్పుడీ సంగతంతా చెప్పింది. విని షాకయ్యాను. అయినా ఫరవాలేదన్నాను ఆఖరికి. ఫరవాలేదన్న ఆ మాట విన్నాక గొంతులో దృఢత్వం తగ్గిపోవడం మీ అమ్మ గుర్తించింది గాబోలు. ససేమిరా వద్దంది. మనం స్నేహితులుగానే వుందాం అంది. నాకు ఎవరూ లేని లోటు తీర్చమంది. లోకులు అనుమానపడకుండా నన్ను పెళ్ళిచేసుకునేవరకూ ప్రాణం తీసింది. ఆనాటినుండి మేం ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కష్టానికి సుఖానికి కలిసిమెలిసి వుంటాం. "రాజారాం, నీకు ఆడపిల్లలుంటే నా కోడల్ని చేసుకునేదాన్ని గదా" అని విచారించేది మీ అమ్మ..." "అంకుల్! యింత నల్లగా, యింత అసహ్యంగా ఎందుకు పుట్టానా అని మధనపడేవాడ్ని. ఆ ప్రశ్నకి జవాబు యిన్నాళ్ళకి దొరికింది. ఎంత దురదృష్టవంతుడ్ని! ఎవడో... తెలియని అనామకుడు, రౌడి నా తండ్రి కావడం... ఎంత దౌర్భాగ్యం." "హుష్, స్టాపిట్ - నీవిలా అంటే మీ అమ్మ చెప్పినందుకు

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.