శుభోదయం 11

By | November 2, 2022
telugu stories sahithi శుభోదయం 11 "వదిలేయండి లాయర్ గారూ! ఎవరి పాపం వారిదే. కేసులు, కోర్టులు అంటూ తిరిగే ఓపిక నాకులేదు. అసలే ఈ గొడవ ఏమిటని బాధపడుతున్నాను. ఈ అపనింద తొలగిపోతే అంతేచాలు నాకు" రాధాదేవి విరక్తిగా అంది. "ఆ.....ఆటోడ్రైవర్ ఎవరో? ఎందుకు వచ్చి విషయం చెప్పడంలేదు" శ్యాం అన్నాడు. "వాళ్ళు డబ్బిచ్చి నోరు మూయించి వుండవచ్చు. లేదా వాళ్ళకి భయపడి మాకెందుకని వూరుకుని వుండవచ్చు" రాజారాం అన్నాడు. "ఆ ఆటోడ్రైవర్ ముందుకువస్తే సగంకేసు పరిష్కారం అయినట్టే" లాయరు అన్నాడు. "రాజారాం, నేను రేపు పేపరులో ఒక ప్రకటన యిద్దామనుకుంటున్నాను. ఒక ఆడపిల్లపై జరిగిన అత్యాచారంలో దోషులను పట్టుకు సహాయపడేందుకు ఆటోడ్రైవర్ మానవత్వంతో ముందుకువచ్చి సహాయపడవలెనని, ఆచూకీ తెలిపితే నూటపదహార్లు బహుమానం అని ప్రచురిస్తాను." "రాధా.....నీకెందుకీ గొడవ? ఇప్పటికే మాధవరావు మండిపడుతున్నాడు. నీవెందుకు తలదూర్చడం? ఇదీ నీ నిజాయితీ నిరూపించుకోవడానికి వేసిన ఎత్తనవచ్చు." "అననీ ఫరవాలేదు. అసలు దోషులు పట్టుపడేవరకు నాకు మనశ్శాంతి వుండదు. నామీద నింద తొలగిపోయేవరకు శాంతిగా బతకలేను. అంతేకాక... రేఖ... ఆ అమ్మాయి అంటే నాకెందుకో యిష్టం కలిగింది. ఈ కేసు పరిష్కరించడానికి నా చాతనయితే సహాయం చేస్తాను" రాధాదేవి పట్టుదలగా అంది. అన్నట్టుగానే మర్నాడు పేపరులో చిన్నప్రకటన యిచ్చింది. మాధవరావు అదిచూసి పళ్ళు కొరికాడు. పంతం కొద్దీ తను నిర్దోషినని నిరూపించుకుని తనకి బుద్దిచెప్పడానికి చేసిందని మండిపడ్డాడు. అసలే పోలీసురిపోర్టు యిచ్చినా వాళ్ళు ఎవిడెన్సు లేదంటూ కస్టడీలోకి తీసుకోనందుకు మంటగా వుంది. దానికితోడు ఈ ప్రకటనచూసి ఏదో అనమానం జరిగినట్టు చిందులుతొక్కాడు. "డాడీ! ఆంటీ మంచి ఆవిడ డాడీ! ఆవిడెందుకు చేయిస్తుంది..." రేఖ తండ్రితో వాదించింది. "నీకు తెలీదు. చిన్నపిల్లవి, మాట్లాడకు" అని గదమాయించాడు. తండ్రి ఎంత నమ్మకంగా చెప్పినా రేఖకి రాధాదేవిని అనుమానించ బుద్ది వేయలేదు. రాధాదేవి ఎవరో తల్లిద్వారా విని ఆశ్చర్యపోయింది. రాధాదేవి మీద అత్యాచారం జరిగితే తండ్రి నిర్ధాక్షిణ్యంగా ఆమెని

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.