శుభోదయం 12

By | November 11, 2022
telugu stories kathalu sahithi శుభోదయం 12 "ఏం జరిగింది? ఎందుకింతపని చేసింది?" తెల్లపోతూ అంది. శ్యాం తల దించుకున్నాడు. "అమ్మా.....రేఖ..... ప్రెగ్నంట్ అయిందని, అందుకని....సిగ్గుతో, భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండు.....వాళ్ళ ఎదురింట్లో వుండే సునీత చెప్పింది. డాక్టరుకి రేఖ నాన్నగారు చెప్పారుట." "మైగాడ్..... ఏదో ఆ గొడవ అంతటితో సమసిపోయిందనుకున్నాను. ఆఖరి కిదీ జరిగిందన్నమాట. రేఖ! పాపం గాభారాపడి, ఏంచెయ్యాలో దిక్కుతోచక, .... యీ పనికి తలపడిందేమో? ఎంత తొందరపడింది? ఈ రోజుల్లో.....ఎబార్షన్ లీగలైజ్ అయిన రోజుల్లో.....యింత గాభరాపడవలసింది ఏముందని యిలా చేసింది?..." "వాళ్ళమ్మే అసలు గాభరాపెట్టి ఏడ్చిందటమ్మా. దాంతో రేఖ భయపడి ఏడ్చిందట నిన్నంతా. యివాళ ఆఖరికిలా చేసిందట." "ఆ శారద తెలివితక్కువతనం రేఖని నాశనం చేస్తుంది. శారద అమాయకురాలు... కాని ఆ తండ్రి ఏంచేస్తున్నాడుట అతనేనా చెప్పవద్దా?" "లేదమ్మా, ఆయనకు తెలిసినట్టులేదు. ఆ తల్లి గాభరాపడి ఏడ్చి....నేనేం చెయ్యనే తల్లీ.....ఆ రాధకీ ఇలాగే జరిగిందే అమ్మా.....అయ్యయ్యో..... అంటూ ఏడ్చి గాభరాపెట్టిందంటుంది సునీత." ఆమాట వినగానే రాధాదేవి మొహం నల్లబడింది. హు.... తన దురదృష్టం అందరికీ ఉపమానం అయిందన్న మాట అనుకుంది. పోనీ తన దురదృష్టం రేఖకి అంటకూడదు. రేఖని కాపాడాలి. మాధవ్ ఏమన్నాసరే.....రేఖని ఓదార్చి తను చెయ్యగలిగింది చెయ్యాలి. తనేం చెయ్యాలి!?... ఏం చెయ్యగలదు? ఆరోజంతా ఆలోచించింది రాధాదేవి. 23 "శ్యాం... ఒకమాట అడుగుతాను. సిన్సియర్ గా జవాబు చెపుతావా?" ఆ రాత్రి డ్రాయింగురూములో కూర్చున్నప్పుడు శ్యాంని అడిగింది, రాధాదేవి. శ్యాం వింతగా తల్లివంక చూసి "ఏమిటమ్మా?" అన్నాడు. రాధాదేవి మాటలకి తడుముకుంది. "శ్యాం, రేఖ.... రేఖంతే నీకు చాలా యిష్టంగదూ..... నన్ను ఓ స్నేహితురాలిగా భావించి జవాబు చెప్పు." కొడుకు మొహంలోకి నిశితంగా చూస్తూ అంది. శ్యాం మొహం ఎర్రబడింది. తల్లివంక చూపు కలపలేక

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.